Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెద్దకొత్తపల్లి
ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ,నిర్లక్ష్యం చేయవద్దని డిఎం హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ లాల్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కల్వకోలు గ్రామంలో డాక్టర్ నిర్మల దాసి ఆరోగ్య మాత కొల్లాపూర్ సహకారంతో మెగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల వలన సీజన్ వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. వాటిపట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, లావు అవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ నేడు నిర్వహించిన వైద్య శిబిరంలో 350 మంది లావుగా ఉన్న వారిని పరీక్షించి 13 మందిని శస్త్ర చికిత్స కొరకు పంపడం జరిగిందని, ఒకరికి కృషి వ్యాధి ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే 12 కొత్త కేసులు, మధుమేహం ఉన్న వారిని గుర్తచడం నలుగురికి చేయవాది ఉన్నట్టు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి ఆఫీసర్ డాక్టర్ కృష్ణ, డివో డాక్టర్ రాజశేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీ నరసింహ గౌడ్, సూపర్వైజర్ బాలాజీ సింగ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.