Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొత్తకోట
ప్రతి విద్యార్థికి చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యం,నాయకత్వం అవసరమని కొత్తకోట మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్ ,విశ్వ మానవతా సంస్థ అధ్యక్షులు అల్లూరి శ్రీనివాస్ చౌదరి , దళిత పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు,సామాజిక కార్యకర్త ఎస్ ఆర్ ప్రేమయ్య అన్నారు.ఆదివారం కొత్తకోట మండలంలోని నాటవెళ్లి పామాపురం శివారులో గల విశ్వ మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యువనాయకత్వ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దాదాపుగా 50 నుంచి 60 ఎకరాల్లో ఎలాంటి రసాయనిక పదార్థాలు లేకుండా మానవజాతికి ఆరోగ్యాన్ని ఇచ్చే పంటలను పండించాలన్నారు. చివరకు ఉప్పు, మిర్చిను కూడా ఇక్కడనే పండించి మానవజాతికి ప్రకతి ఫలాలు అందిస్తున్న విశ్వ మానవ సంస్థ వ్యవస్థాపకులు అల్లూరి శ్రీనివాస్ చౌదరిని అభినందించారు. అంతేకాకుండా 2011లో లండన్ నుంచి ఢిల్లీ వరకు దాదాపుగా 9000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి తాను పుట్టిన భారతదేశంలోనే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండే విధంగా సేవలందించాలని లక్ష్యంతో ముందుకు రావడం శుభ పరిణామమని కొనియాడారు. ఆ క్రమంలోనే హైదరాబాద్ నుండి బెంగళూరుకు పాదయాత్ర చేస్తూ న్యాటవెళ్లి.. పామాపురం పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని మానవజాతి అంతరించకుండా రసాయన పదార్థాలు లేని ఆర్గానిక్ పంటలను పండించి ఇతరులకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమన్నారు. దీంతోపాటు ప్రస్తుత దసరా సెలవుల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వడానికి ముందుకు రావడం పట్ల ప్రత్యేకంగా అభినందించి విశ్వ మానవతా సంస్థ వ్యవస్థాపకులు అల్లూరి శ్రీనివాస్ చౌదరి సత్కరించారు. అనంతరం శిక్షణ పొందడానికి వచ్చిన జడ్చర్ల మండలం అవంచ విద్యార్థులతో, మదనాపురం మండలంలోని అజ్జకొల్లు గ్రామ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వహీద్ అలీ,జహీర్ తదితరులు పాల్గొన్నారు.