Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 28న కార్మికుల సమావేశాన్ని జయప్రదం చేయండి
- సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ మల్లేష్
నవతెలంగాణ- అచ్చంపేట రూరల్
జీపీ కార్మికులకు కనీస వేతనం,పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ మల్లేష్, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అచ్చంపేట మండల కార్యదర్శి బాలస్వామి ఇరువురు పిలుపునిచ్చారు. మండల పరిధిలొని సిద్దాపూర్ గ్రామంలో వివిధ గ్రామ పంచాయతీ కార్మికు లతో సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 28న అచ్చంపేట తెలంగాణ భవనంలో నిర్వహించే గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని తెలిపారు.కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్నారు. అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్, సంవత్సరానికి రెండు జతల బట్టలు, బ్లౌజులు, బూట్లు వంటి రక్షణ పరికరాలు అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 28న అచ్చంపేట పట్టణంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల భవనంలో నిర్వహించే జనరల్ బాడీ సమావేశానికి కార్మికులు తప్పకుండా హజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు హరీష్ నాయక్, గ్రామపంచాయతీ కార్మికులు శ్రీను, అంజయ్య, పరమేశు, వెంకటేష్, బాలస్వామి, లక్ష్మణ్, లాల్ కష్ణ, కళమ్మ పాల్గొన్నారు.