Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగణ - ధరూర్
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ వివిధ వార్డులోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెక్కును అందజేశారు. శైహాన్ సర్కార్ కు చికిత్స నిమిత్తం 2లక్ష 25వేలు రూపాయలు.శ్యామల కు చికిత్స నిమిత్తం రూ.20 వేలు, కేశవులుకు చికిత్స నిమిత్తం రూ. 16 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్స్ నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, మహేష్, గద్వాల టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రంజిత్, నాగులు యాదవ్, రిజ్వాన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.