Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -నారాయణపేట టౌన్
కరాటే వల్ల ఎన్నో లాభాలున్నాయని పేట సీఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీటీజన్ క్లబ్ లో సీనియర్ కరెక్టే మాస్టర్ బాలరాజుతో శిక్షణ పొందిన మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. బెల్ట్ సాధించిన వారికి పేట సీఐ శ్రీకాంత్ రెడ్డి కరాటే బెల్ట్స్ అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక దారుణ్యంతో పాటు మంచి క్రమశిక్షణ అలవాటు అవుతుందని అన్నారు. కరాటే మాస్టర్ బాలరాజు ను అభినందించారు. కరాటే మాస్టర్ బాలరాజు మాట్లాడుతూ 13 మంది విద్యార్థులకు ఆరెంజ్ బెల్ట్, 13 మంది విద్యార్థులకు గ్రీన్ బెల్ట్, 5 మంది విద్యార్థులకు బ్లూ బెల్ట్, 5 మంది విద్యార్థులకు మెరూన్ బెల్ట్ సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కరాటే మాస్టర్లు రసూల్ ,మహేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట : పట్టణంలోని బాలికల ఉన్నంత పాఠశాల ఆవరణలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్టు గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే అకాడమీ చీఫ్ ఎగ్జామినేర్ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పోటీలకు 20 మంది బాల బాలికలు పాల్గొని చక్కటి ప్రతిభ కనబరిచి బెల్ట్ సర్టిఫికెట్ సాధించారు. ఈ విద్యార్థులు ప్రైమరీ బేసిక్స్, కిక్, కాటాస్, వివిధ విభాగాలలో చక్కటి ప్రతిభ కనబరిచారని క్లబ్ పౌండర్ నబీ తెలిపారు. వీరిలో ఎల్లో బెల్ట్ సాధించిన విద్యార్థులు బి పూజ, బి అక్షయ, ఏ వెంకట విశ్వతేజ, జి శశికుమార్, కే ఏకాంబరి, బి చిరాక్, బి ఓంకార్, టి వెంకటేశ్వర రెడ్డి,ఆరెంజ్ బెల్ట్ సాధించిన విద్యార్థులు ఈ భాను ప్రకాష్ యాదవ్, జి గాయత్రి యాదవ్ గ్రీన్ బెల్ట్ సాధించిన విద్యార్థులు, కే యశ్వంత్, ఏ రిషిత, ఏ అభినవ్ తేజ్, కే కార్తీక్, బ్లూ బెల్ట్ సాధించిన విద్యార్థులు సి హర్షిత్ రెడ్డి, మెరూన్ బెల్ట్ సాధించిన విద్యార్థి జి శివకుమార్ యాదవ్, ఎం పవన్ తేజ్ యాదవ్, బ్రౌన్ బెల్ట్ సాధించిన విద్యార్థి కే గణేష్ యాదవ్ సాధించిన విద్యార్థులకు రిపోర్టర్ రాములు చేతుల మీదుగా విద్యార్థులకు బెల్ట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కరాటే మాస్టర్స్ జాఫర్, సాదిక్, జి హరీష్ యాదవ్,ఇంతియాజ్, జాంగిర్, సుమ, చందు, ఎస్.కె బాబా అజ్మీర్, ఎస్కే, గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.