Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీనగర్లో ఇళ్లల్లోకి చేరిన నీరు
నవతెలంగాణ -కల్వకుర్తి
కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారంభారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం3 గంటలకు ప్రారంభమైన వర్షం దాదాపు గంటన్నరకు పైగా ఎడతెరిపి లేకుండా కురవడం తో వాగులు వంకలు ఏరులై పారాయి. కల్వకుర్తి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థాని కులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవ డంతో వీధి వ్యాపారులతో పా టు వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. 15 రోజులుగా వర్షాలు కుర వక పోవడంతో పత్తి పంటతో పాటు మెట్ట పంటలు ఎండు ముఖం పట్టడంతో రోతులు ఆందోళనకు గుర య్యారు. ఆదివారం కురిసిన వర్షాలతో వారు కొంత ఊరట చెందారు.