Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి
నవతెలంగాణ -ఆత్మకూర్
పట్టణ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఉదయం 10.10 నిమిషాలకు పట్టణంలోని 8 వ వార్డులో మున్సిపల్ సిబ్బంది సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవికుమార్ మాట్లాడుతూ దోమల నుండి వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నం దున పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం కాలనీలోని మురుగు కాలువలను శుభ్రం చేసి ,నిలువ నీటిని పారబోసి ఆబైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ , టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.