Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందికొండ గీత
కోడేరు: ఇండ్ల స్థలాలు ఉన్న లబ్ధిదారులకు హద్దులు చూపే వరకు పోరాటం ఆపేది లేదని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందికొండ గీత అన్నారు. ఆదివారం ఆమె మండల పరిధిలోని ఎత్తం గ్రామంలో గుడిసెలు వేసుకొని ఉంటున్న లబ్ధిదారు లకు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఉండి గుడిసలేసుకున్నావారందరూ ప్రభుత్వ అధికారులు హద్దులు చూపించే వరకు సంఘటితంగా పోరాటం కొనసాగించాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో సర్వే నిర్వహించి ప్లాట్లకు హద్దులు చూపించే విధంగా కృషి చేస్తామన్నారు. ఆమె వెంట సీఐటీయూ జిల్లా నాయకులు అశోక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నరసింహ, స్థానిక ప్రజా సంఘాల నాయకులు బలమోని శ్రీను, షాగాది నిరంజన్, పి.రామచంద్రి, ఉడుత నిరంజన్, ఎత్తం గ్రామ మాజీ ఉపసర్పంచ్ బాలస్వామి, లబ్ధిదారులు ఉన్నారు.