Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : వీఆర్ఏ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగించ కొనసాగిస్తామని వీఆర్ఏసి మండల అధ్యక్షుడు రమేష్ స్పష్టం చేశా రు. వీఆర్ఏల జేఏసీ నిరవధిక సమ్మెలో భాగంగా 64 రోజైన సోమవారం సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు మేరకే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని, వారిని పర్మనెంట్ చేయకుండా, పే స్కేల్ ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకెళ్ళు ఇవ్వడంతో తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వస్తుందని చెప్పారు. వయసు పైబడిన వీఆర్ఏల కుటుం బాలలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయమంటున్నాం తప్ప కొత్తగా ఏ కోర్కెలు కోరడం లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు సురేష్, కష్ణవేణి, లక్ష్మి, తిరుపతయ్య పాల్గొన్నారు.
మిడ్జిల్ : వీఆర్ఏలందరికీ పే స్కేలు అమలు చేయాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏల చైర్మన్ శ్రీశైలం, కో చైర్మన్ కర్ణాకర్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్, అన్నారు .సమ్మెలో భాగంగా సోమవారం దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి సమ్మె చేస్తున్న వీఆర్ఏల సమస్యలు ప్రభుత్వ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు .ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు .55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు చరతలు లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు .ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు చెన్నయ్య, శివకుమార్, మల్లేష్, కాసిం, గౌస్, కళావతి, వెంకటమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు
బల్మూరు : ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను ప్రభు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 64 రోజులుగా వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ వీఆర్ఏ జిల్లా సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తాన్నామని వీఆర్ఏల సంఘం నాయకులు జహంగీర్ వెంకటయ్య తిరుపతయ్య తెలిపారు. ఈ రిలే దీక్షలలో ఆయా గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సమ్మెను విరమించేది లేదని మండల వీఆర్ఏల జేఏసీ జనరల్ సెక్రటరీ ప్రసన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 64వ రోజుకు చేరుకుంది. మొఖమోని దీక్షతో వీఆర్వోలు సమ్మెను కొనసాగిస్తున్నారు .ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసి కన్వీనర్ మల్లేష్ నాయుడు, కో కన్వీనర్ రాములు, వీఆర్ఏలు బంగారయ్య, లలిత, సోమేశ్వరి, చిన్న నరసింహ, ప్రశాంత్, వెంకటేష్ ,కోదండమ్ ,చిన్నయ్య ,కాజ మైనదిన్ తదితరులు పాల్గొన్నారు.