Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి
షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు సవరించాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సిఐటియు, ఏఐటీయూసీ, ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష, ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాల వేతనాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించా లన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సవరణ జరగలే దన్నారు. వివిధ రంగాల కార్మికుల కనీస వేతనాలు పెరగలే దన్నారు. కనీస వేతనాలు చట్టం 1948 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 2005, 2012 మధ్య కనీస వేతనాలు సవరించ బడ్డాయ న్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. రాజు, వనపర్తి జిల్లా హమాలి సంఘం జిల్లా అధ్యక్షులు శాంతయ్య, సిఐటియు నాయకులు నాగన్న, భాస్కర్ గౌడ్, రవి, రామస్వామి, ఏ.ఐ.టి.యు.సి నాయకులు రవీందర్, భీమన్న, మల్లేశ్, ఐ.ఎఫ్.టి.యు నాయకులు రాజేందర్, అజీద్, వెంకటన్న,రమేష్ తదితరులు పాల్గొన్నారు.