Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానానికి వెళ్లే దారిలో స్వాగత ఆర్చి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఇంజనీర్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం ఆయన జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనులతో పాటు రహదారి విస్తరణ అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆయన ఆదేశించారు. రోడ్డుకు మధ్యలో వస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను తొలగించకుండా సంరక్షిస్తూ పనులు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లేఔట్లను పరిశీలించారు.