Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతోత్సవాలు
- నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఐలమ్మ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఐలమ్మ పోరాట స్పూర్తిని కొనియాడి ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
నవతెలంగాణ- వనపర్తి
ఐలమ్మ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర వ్యవసా య శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ భూ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పోరాటంతో దొరలు ఎదురు నిలువ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆమె భూ పోరాటం వల్లే లక్షల ఎకరాలను పేదలకు పంచగలి గారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ కారాలయం భవనంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలోనైనా రాణించగ లరని, రైతుల తరపున నిలబడి దొరలకు ఎదురు నిలిచి పోరాడిన వీరవనిత ఐలమ్మ అన్నారు. ఆమెను స్పూర్తిగా తీసుకొని మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జడ్పీ సీఈఓవెంకట్ రెడ్డి ఎస్సీ అభివద్ధి శాఖ అధికారి నుశిత, ఉద్యాన శాఖ అధికారి సురేష్, డీపీఆ ర్ఓ రషీద్, బీసీ సంక్షేమ సహాయ అధికారి బీరం సుబ్బారెడ్డి, రజక సంఘం నాయకులు, కోళ్ళ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
బిజినేపల్లి: మండలంలోని నంది వడ్డెమాన్ గ్రామం లో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి ఉత్స వాలను పురస్కరించుకొని ఎన్ఎస్ఐ తిప్పిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఐలమ్మ కాంస్య వి గ్రహాన్ని ఎంపీ పోతుగంటి రాములుతో కలిసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనగారిన వర్గాలను బానిసలులగా చేసుకొని ఆధిపత్యం చెలాయిస్తున్న దొరల, దేశముఖ్‌ల ఆగడాలను అడ్డుకొని తన భూమిని సాధించుకొన్న తిరుగుబావుట ఎగర వేసిన వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అధికారికంగా ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తోందన్నారు. ఉస్మా నియా యూనివర్సీటీ జేఏసీ నాయకుడు దత్తాత్రేయ, సామాజిక కార్యకర్త సుధాకర్‌లు చాకలి ఐలమ్మ గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్. ఏఏసీఎస్ చైర్మన్ నాయినోళ్లు బాల్‌రాజుగౌడ్, రైతుబంధు మండల అధ్యక్షుడు నెల్లికంటి మహేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ఉ వంగ సుదర్శన్ గౌడ్, మస్కూరి అవంతి, ఎంపీటీసీ సభ్యు డు మ్యాతరి ఊశన్న, ఉపసర్పంచ్ శంకర్, రజక సంఘం నాయకులు రేమొద్దుల తిరుతపయ్య. రేమొద్దుల రమేష్ భగవనేని నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
పాలెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసినివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవిందు లావణ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్: జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాల యంలో ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బాలమణి , తదితరులు పాల్గొన్నారు.
ధరూర్: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమా వేశ మందిరంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించా రు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం, వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ కరుణ తదితరులు ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ మహిళలు ఏ రంగంలోనైనా రాణించవచ్చని అందు కు చాకలి ఐలమ్మే నిదర్శనమన్నారు. తెలంగాణా ఉద్య మానికి చాకలి ఐలమ్మ పోరాటమే స్పూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్వేతా ప్రియదర్శిని, రజక సంఘ ప్రసిడెంట్ మిద్యాల నరసింహులు , పేపర్ నర్సిములు, శ్రీరాములు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కందనూలు: నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ ఐలమ్మ చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, సహాయ బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీధర్‌జీ, డీిఎల్పిఓ రామ్మోహన్రావు, వివిధ ప్రజా సంఘ నాయకులు నరసిం హులు, కవి వనపట్ల సుబ్బయ్య, టీచర్ మల్లేష్, ఆటో శేఖర్ నవీన్ కుమార్, బాలస్వామి, ల్యాండ్రీ మల్లేష్, ఫోటో శేఖర్ , సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మారేడు శివశంకర్, ఏ ఐ వై ఎఫ్ నాయకులు సాయితేజ, ఎన్ పోతుల సత్యనా రాయణ, నితిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ దండోరా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జ్ మంతటి గోపి ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనం గా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణుక మాదిగ, రాష్ట్ర నాయకులు చుక్క వెంకటస్వామి, తాలూకా అధ్యక్షులు భీమ య్య మాదిగ, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఉట్కూర్: మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పిటిసి అశోక్ గౌడ, ్ ఎంపీపీ ఎల్కోటి లక్ష్మీనారాయణ రెడ్డి ఐలమ్మ చిత్రపటాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాళ్ళప్ప, ఏపీఓ ఎల్లయ్య, సర్పంచ్ సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ : మండల కేంద్రంలో ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గౌస్, రజక సంఘం నాయకులు శ్రీనివాసులు, నాయ కులు వెంకట్ రెడ్డి, రామ్గౌడు, బాబా, వెంకట్ సాగర్ , నరేష్, ఆచారి, రాఘవేందర్ నాయకులు తదితరులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఆత్మకూర్: తహసిల్దార్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి తహసిల్దార్ అబ్దుల్మతిన్, ఆర్ఐ ఏ.నర్సిం లు, డిప్యూటీ తహసిల్దారు చాణక్య, నాగేంద్ర ప్రసాద్, బ్రహ్మయ్య, వెంకటమ్మ ,నరసింహులు తదితరులు పూలు వేసి నివాళి అర్పించారు.
ఉండవల్లి: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, ఎంపీడీఓ వీరభద్రప్ప అంజిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మనపాడు మండల కేంద్రంలో ఎంపీపీ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఐలమ్మ జంయంతి వేడుకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యాదగిరి, ఎంపీడీవో రమ ణారావు పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతి నిధు లు తదితరులు పాల్గొన్నారు.
అమరచింత: మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్ ఐలమ్మ చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, మేనేజర్ ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు బి.ఎస్. రాజ్ కుమార్, కృష్ణయ్య, మున్సిపాలిటీ సిబ్బంది, ఏం ప్రభాకర సాయి ఆదిత్య, రవి పాల్గొన్నారు.
కోడేరు: మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద రజక వృత్తిదారుల సంఘం మండల అధ్యక్షులు దాస రాజుల రవి అధ్యక్షతన ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం మండల కార్యదర్శి చర్లపల్లి పెద్ద రాములు , కోశాధికారి చర్లపల్లి చిన్న రాములు , బహుజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఆది సోమనాథ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిరాంరెడ్డి, చామంతి రాజు , సింగోటం మాజీ సర్పంచ్ వెంకట స్వామి, బిజెపి నాయ కులు రామకృష్ణ, వార్డు మెంబర్ బాలస్వామి , మైనార్టీ నాయకులు మక్బుల్, రజక వృత్తిదారుల సంఘం నాయ కురాలు సుజాత, సోప్పరి సత్యనారాయణ పాల్గొన్నారు.
ధరూర్: గద్వాల జిల్లా కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఐలమ్మ చిత్రప టానికి సంఘం జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కన్వీ నర్ బుచ్చిబాబు, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపా ధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, ఉప్పరి కృష్ణ, ఉలిగేపల్లి లక్ష్మన్న, ఆలూరు వెంకట్రాములు, మీసాల కిస్టన్న ఆశన్న,తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
తెలకపల్లి: మండల కేంద్రంలో ఎంపీపీ కొమ్ము మధు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలు సింగిల్ విండో వైస్ చైర్మన్ డైరెక్టర్లు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు పోలేపల్లి యాదయ్య, టిఆర్ఎస్ మండల కార్యనిర్వాకాధికారి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వీపనగండ్ల: మండల పరిధిలోని సంగినేనిపల్లి , గోవర్ధనగిరి తదితర గ్రామాల్లో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. సంగినేనిపల్లిలో ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్, సర్పంచ్ మౌలాలి, గోవర్ధ నగిరిలో ఎండి మహబూబ్ భాష ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిన్నారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఎస్ వెంకటయ్య కురుమ య్య , సిపిఎం నాయకులు రామచంద్ర గౌడ్ , శివకోటి , శేఖర్, రాజు, చిన్నకృష్ణ, నాగరాజు, శేఖర్, నరేష్, భాష , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి: మండల కేంద్రంలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఔసర్పంచి ఆదేర్ల వెంకటేశ్వర్ రెడ్డి, మండల రజక వృత్తిదారుల సంఘం నాయకులు పూలలుమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు ఇంద్రకంటి అలీ అక్బర్ ,ఉపాధ్యక్షులు ఇంద్రకంటి బాలస్వామి ,ప్రధాన కార్య దర్శి పెద్దాపురం షాలిశ్వర్ ,రజక వృత్తిదారుల సంఘం సభ్యులు ఇంద్రకంటి శ్రీనివాసులు ,లింగస్వామి, మొగలి నాగరాజు, ఆంజనేయులు ,సి వెంకట స్వామి, సి ఈశ్వర్ ,ఇంద్రకంటి శేఖర్, ఇంద్రకంటి ప్రభాకర్ ,చెన్నారం లక్ష్మయ్య ,ఇంద్రకంటి ఉమా శంకర్, టి వెంకటస్వామి పాల్గొన్నారు.
వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నాగన మోని చెన్న రాములు, జిల్లా ఉపా ధ్యక్షులు చిరంజీవి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గడ్డం మV ాష్ జిల్లా కార్యదర్శి ఎం తిరుమలేష్ , మండల కన్వీనర్ కాటుక కురుమయ్య , బిఎస్పి నాయకులు నితీష్ గంధం నాగరాజు , సునీల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్: తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ గోపాల్ రావు, జూనియర్ అసిస్టెంట్, ఆర్ఐ సుధాకర్ రెడ్డి , కంప్యూటర్ ఆపరేటర్ రవికుమార్, శివారెడ్డి, కార్యాల సిబ్బంది, ఎంపీటీసీ సీమా గోపాల్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎల్.తిరుపతయ్య, ఎస్ బుచ్చన్న , సాకలి తిమ్మన్న, కురుమన్న, రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఊరుకొండ: మండల పరిధిలోని రాచాలపల్లి గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి ఉపసర్పంచ్ పరుశ రాములు తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, జంగయ్య, నిరంజన్, అమరేష్ రెడ్డి, రమేష్‌గౌడ్, ఉస్సేన్ పాల్గొన్నారు.
మహమ్మదాబాద్: మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో మండల రజక సంఘం అధ్యక్షుడు రాములు , టీ పిసిసి ఆర్గనైజర్ సెక్రటరీ ఈ.రాములు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కమతం రాజేందర్ రెడ్డి, బెస్త రాజేశ్వర్, ఎంపిటిసి చెన్నయ్య, అశోక్ రెడ్డి,అనంతయ్య గుప్తా, ఈశ్వరయ్య,జెట్టి నర్సింలు, లక్ష్మినారాయణ,దీపక్, వేణు గౌడ్ తదితరులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించారు.
తహసీల్దార్ కార్యాలయంలో తసిల్దార్ అంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ యాదయ్య, అంజన్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి నివాళి అర్పించారు.