Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ -కందనూలు
నాగర్కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత ఇంటర్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలనిఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం గ్రామలకు బస్సులు నడిపించాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల లకు విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వడంతో గ్రామాలకు బస్సులు రావడం లేదని దీంతో ఇంటర్ విద్యార్థులు కాలేజీలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే నాగర్కర్నూల్ మండలం లోని గన్యాగుల, యద్మతాపూర్, పెద్దపల్లి, పెద్దాపురు తదితర గ్రామాలకు బస్సులు నడిపించేలా చూడాలని లేకుంటే బస్సు డిపో ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మారేడు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు నితిన్ కుమార్, నరేష్,మున్న శివ సురేష్, విద్యార్థులు ఉన్నారు.