Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలకపల్లి ఎంపీపీ కొమ్ము మధు
నవతెలంగాణ - తెలకపల్లి
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలను , అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై విమర్శలు చేస్తు న్నారని ఎంపీపీ కొమ్ము మధు అన్నారు. సోమవారం ఎంపీపీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగం జనార్ధన్‌రెడ్డి 20 సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా మంత్రి గా ఉండి నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించారని విమర్శించారు. దళితులను వాడుకొని పదవులు పొందిన ఆయన టిఆర్ఎస్ పార్టీని, ఎమ్మెల్యేని విమర్శిం చే హక్కు లేదన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులకు ఎన్నో పదవులు, గౌరవం దక్కాయన్నారు . ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవ ర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. జిల్లా కేంద్రంగా మార్చడంతో పాటు జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయించడంతో పాటు ఎన్నో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారన్నారు. ఇవ్వన్నీ చూసి ఓర్వలేకే నాగం జనార్ధన్ రెడ్డి నోటికొచ్చినట్టు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వెంటనే నాగం తప్పుడు ఆరోపణలు మానుకో వాలని లేదంటే టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపిటిసిలు ఆర్.రమేష్, విజయలక్ష్మి , రైతుబంధు మండల అధ్యక్షులు జి.మాధవరెడ్డి, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ మామిళ్ళపల్లి యాదయ్య, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివా సులు. వివిధ గ్రామాల సర్పంచులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.