Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు సిరువాటి శ్రీనివాసులు
నవతెలంగాణ- మక్తల్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సీ ఉపకులాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరువాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల,మాదిగలతో పాటు ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉన్నాయ్నారు. దళిత బంధులో దళితుల్లోని ఒకటి రెండు కులాలకే ప్రాధాన్యత ఇస్తూ మిగతా ఉపకులాలను పట్టించుకోవడం లేదన్నారు. రెండు, మూడో విడతలో పూర్తి స్థాయిలో ఆర్థికంగా,సామాజికంగా వెనకబడ్డ అన్ని ఉపకులాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ ఆలోచన మేరకు ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించి జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్లకు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకోవడానికి తాము కూడా సిద్దంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో నారాయణపేట జిల్లా కన్వీనర్ జీర్గల్ నగేష్ మాదిగ , రాష్ట్ర నాయకులు గడ్డం కృష్ణయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎడవల్లి భాస్కర్, బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షులు సల్ల వెంకటేష్, నియోజకవర్గం కన్వీనర్ గొల్లపల్లి జ్ఞాన ప్రకాష్ మాదిగ, యూత్ కోఆర్డినేటర్ సిరిగిరి వీరన్న తదితరులు పాల్గొన్నారు.