Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక వర్షాలు వడగండ్ల ముప్పు
- నిండా మునిగిన బొప్పాయి రైతు
- వైరస్ వల్ల తోటలను తొలగిస్తున్న రైతులు
- బొప్పాయి రైతులను ఆదుకోవాలి
- రైతు సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి బాల్ రెడ్డి
ఒకవైపు అంతుచిక్కని వైరస్ మరోవైపు అధిక వర్షాలు బొప్పాయి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తే ఎకరాకు 15 లక్షల ఆదాయం రావాలి. వైరస్ సోకడం వల్ల ఈసారి బొప్పాయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ముఖ్యంగా ఉద్యానవన శాఖ అధికారులు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంది.ఈ నష్టాన్ని ప్రభుత్వమే తీర్చాలని రైతులు రైతు సంఘాలు కోరుతున్నారు.
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 25వేల ఎకరాలలో ఈ తోటలను వేశారు. జామ బత్తాయి మామిడి కలిపి ఉన్నాయి. గత రెండేండ్ల్ల నుంచి వాతావరణం అనుకూలించ కపోవడం లేక ప్రకృతి వైపరీత్యాలలో కానీ పండ్ల తోటలపై వైరస్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఒకసారి వైరస్ సోకితే చెట్టుకు ఉన్న ఆకు మొత్తం రాలిపోతుంది. కాయలు మునగిపోతాయి. చెట్టు ఒరిగిపోతుంది. దీనికి తోడు వడగండ్లు అధిక వర్షాలు తోడయ్యాయి. కల్వకుర్తి మండలం లింగస్వామి పల్లి దగ్గర రైతు తన పొలంలో బొప్పాయి పంటను సాగు చేశారు. నిర్వాణ పనులు పూర్తి చేసినప్పటికీ పంట చేతికి వచ్చే దశలో పూట మొత్తం కుప్పకూలి పోయింది. ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పెట్టి సాగు చేసిన బొప్పాయి తోట చేతికి అందకుండా పోవడంతో సుమారు పది లక్షలకు పైగా అప్పుల పాలయ్యారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడనికి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
రైతుకు అందని రొక్కం
బొప్పాయి తోట వేయడానికి విత్తనానికి ముందే దుక్కులు సదులు చేయాల్సింది. ఆ తర్వాత పుట్టాస్ తల్లి భూమిని సారవంతం చేస్తారు. తోటలకు డ్రిప్పు విధానం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎర్ర పువ్వ భూములు అయితే కలుపు అధికంగా పెరుగుతుంది. కేవలం కలుపు నివారణ కోసమే రైతులు 30 వేల రూపాయల ఖర్చుఅవౌతుంది. కర్నూలు జిల్లా అనంతపూర్ నాందేడ్ నుంచి బొప్పాయి మొక్కలను తెచ్చి విత్తుతారు.70 రోజుల వయసు కలిగిన మొక్కలు తెచ్చి నాటి అన్ని రకాల పొలం నిర్వహణ పనులు చేపడతారు. ముందు గ్లాసులో పెంచి ఆ తర్వాత భూమిపై నాటడం వల్ల 70 రోజులలో మొక్కకు ఎటువంటి వైరస్ సోకదు. భూమిలో నాటిన నాటినుంచి మొదలుకొని ఆరు నెలలోపు వీర సోకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పూత దశ దాటి కాయలు ఏర్పడగానే వైరస్ తో పాటు పండు ఈగ తగులుతుంది. ఒకసారి పండు పై పండు ఈగ వాలితే పండు మచ్చ తో పుండుగా మారుతుంది. ఫుల్లుగా మారిన బొప్పాయి తినడానికి పనికిరాదు. వారం రోజుల్లో నివారణ చర్యలు చేపట్టకపోతే తోట మొత్తం పండుగ వాలి కాయలను కుప్పకూల్తుంది. పండు ఈగ నివారణ కోసం హైదరాబా దులోని గడ్డి అన్నారం మార్కెట్లో ఒక రకమైన ఏరా బాక్స్ తెచ్చి అందులో సువాసన గలిగిన టాబ్లెట్లు వేస్తారు. టాబ్లెట్ల వాసనకు పండు ఈగలు వచ్చి డబ్బులు పడి చనిపోతాయి. ఇంకా రైతులు వైరస్ నివారణ కోసం పడరాని పాట్లు పడుతుంటారు. తెలకపల్లి మండలంలో కొంతమంది రైతులు వైరస్ ఒకగానే తోటలను తొలగి స్తున్నారు. ఒకసారి వైరస్ వంటి తెగుళ్లు సోకితే ఆ తోట కోలుకోవడం కష్టం. అందుకే ఎంత పెట్టుబడి అయినా సరే తెగుళ్ల నివారణ కోసం పిచికారి చేసే విధంగా రైతులు సిద్ధంగా ఉంటారు.
ప్రేక్షక పాత్రలో ఉద్యానవన శాఖ
జిల్లాలో తోటలకు సంబంధించిన వైరస్ ప్రకతి ప్రతాపం వల్ల జరిగే నష్టాన్ని నివారించడానికి ఉద్యానవన శాఖ ఉపక్రమించడం లేదు. అయితే బొప్పాయి తోటలకు ప్రత్యేకంగా ఉద్యానవన శాఖ ఉన్నప్పటికీ రైతులకు సల హాలు సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పదివేల ఎకరాలలో బత్తాయి తోటలను తొలగించారు.30 తోటల సైతం వైరస్ వల్ల అనేక చొక్కా రైతులు ధ్వంసం చేస్తు న్నారు. ఇప్పటికైనా బత్తాయి తోట రైతులకు నష్టాన్ని అందేలా చర్యలు తీసుకోవాలని పలు రైతు సంఘాలు కోరారు.
బొప్పాయి రైతులను ఆదుకోవాలి
పండ్ల తోటలను సాగు చేయాలని సలహాలిస్తున్న ఉద్యా నవన శాఖ అధికారులు పంట నష్టపరిహారంపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా బొప్పాయి తోటలను సాగు చేసిన రైతుల పరిస్థి తిని దష్టిలో ఉంచుకొని ఋణాన్ని మాఫీ చేయాల్సి ఉంది.
- బాల్రెడ్డి, రైతు సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి.