Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహ రెడ్డి
నవ తెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
భారత్ మాల భూ బాధితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్లో భారత్ మాల భూ బాధితుల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మార్కెట్లో భూముల ధరలు రోడ్డుకు ఇరువైపులా 80 లక్షల నుంచి కోటి 20 లక్షల దాకా బహిరంగ మార్కెట్లో ధరలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం భారత్ మాల కొరకు భూములు సేకరిస్తున్న సందర్భంలో ఎకరాకు ఐదు నుంచి ఆరు లక్షల మాత్రమే చెల్లిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ కు 2013 చట్టాన్ని జోడించి గ్రామాలలో మూడు రెట్లు పట్టణ ప్రాంతంలో రెండు రెట్లు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త భూసేకరణ చట్టాన్ని తప్పుగా అమలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుస రిస్తున్నాయన్నారు.మీరు ఐక్యంగా ఉద్యమించడం ద్వారా మాత్రమే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది కావున మీరు జిల్లాలో చేపట్టే ఉద్యమం న్యాయమైన పరిహారాన్ని సాధిస్తుందని తెలిపారు. అట్లాంటి మీ ఉద్యమానికి తెలంగాణ రైతు సంఘం మా రాష్ట్ర కమిటీ పూర్తి సహకారాన్ని మద్దతును తెలియజేస్తుందని చెప్పారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ మాట్లా డుతూ మల్లన్న సాగర్,ఖమ్మం ఎక్స్ప్రెస్ హైవే,ముచ్చర్ల ఫార్మా కొరకు భూములు సేకరిస్తున్న సందర్భంలో రైతాంగం,బాధితులు విరోచితంగా పోరాటం ద్వారా మెరుగైన పరిహారాన్ని సాధించు కున్నారని గుర్తుచేశారు. న్యాయమైన పరిహారాన్ని భారత్ మాల భూ బాధితులు పోరాడి సాధించుకొని రాష్ట్ర భూ భాదితులకు ఆదర్శంగా నిలవాలని అలాంటి పోరాటంలో తెలంగాణ రైతు సంఘం అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో భూ సంరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ వెంకట్ రామ్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ , పి.ఆంజనేయులు, మక్తల్ ఏరియా కన్వీనర్, గోవింద్ రాజ్ మక్తల్ మండల కన్వీనర్ , బాధితులు తదితరులు పాల్గొన్నారు.