Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారుల ను ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ఆధ్వర్యంలో ప్రజా వాణి నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల నుంచి వచ్చిన 25 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
ధరూర్ : ప్రజల నుండి వచ్చిన ప్రజా పిర్యా దులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సమస్యల ఫిర్యాదులను శ్రీహర్ష తో కలిసి ప్రజా పిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్ర మం ద్వారా 72 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష స్తానిక సమస్తలు , ఆర్ డి ఓ రాములు, ఏ ఓయాదగిరి,జిల్లా అధికారులు, రాజు పాల్గొన్నారు.
వనపర్తి రూరల్ : పలు ప్రాంతాల నుండి 17 మంది ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ కె అపూర్వరావు తెలిపారు. జిల్లా నుంచి అందిన ఫిర్యాదులు 10 భూ సంబంధిత ఫిర్యాదులు 1 భార్యాభర్తల మధ్య గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు 6 పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని ఆమె తెలిపారు
కందనూలు :ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్. మోతిలాల్, జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహి ంచారు.ఈ ప్రజావాణి (35) ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఎస్పీ ప్రజావాణి సోమ వారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 02 మంది ఫిర్యాదు దారు లు వచ్చాయని జిల్లా ఎస్పీ శ్రీకె మనోహర్ తెలిపారు.