Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తెలకపల్లి
ప్రత్తి పంటలో టోబాకో స్ట్రీక్ వైరస్ ఉందని దాన్ని నివారించుకోవాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం, జీడిమెట్ల హైద్రాబాద్ శాస్రవేత్తలు ఏ కృష్ణారెడ్డి (డిప్యూటీ డైరెక్టర్ కలుపు మొక్కల విభాగం), రవిశంకర్ (సహాయ శాస్త్రవేత్త, పంటల సంరక్షణ విభాగం) లు అన్నారు సోమవారం మండల పరిధిలోని రాకొండ గ్రామంలో క్షేత్ర స్థాయిలో పత్తి పంటను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో టోబాకో స్ట్రిక్ వైరస్ పత్తి పంటను ఆశించిందని అన్నారుపత్తిలో టోబాకో స్ట్రీక్ వైరస్ 5-10శాతం ఆశించిందని, మొదట్లో ఆకులు పసుపు రంగుకు మారి తర్వాత ఆకులు మాడిపోయినట్లుగా అవుతాయన్నారు. దీని ద్వారా మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. తర్వాత దశలో గూడ రాలి, పంటల దిగుబడి తగ్గుతుందన్నారు. పంట పొలాలలో గట్లపై వయ్యారి భామ లేకుండా చూసుకోవాలి.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావ్య , ఎంపీటీసీ ఎంపీటీసీ శివకుమార్ రెడ్డి, రైతులు బుగ్గస్వామి, మల్లారెడ్డి. విజయభాస్కర్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.