Authorization
Fri March 14, 2025 10:07:54 pm
నవ తెలంగాణ -వనపర్తి :
తాసిల్దారు కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దారుకు 466 వ్యక్తిగత దరఖా స్తులను మంగళవారం అందజేసినట్లు ప్రజాసంఘాల పోరాటవేదిక నాయకులు పుట్ట ఆంజనేయులు తెలిపారు. ఇంటి స్థలంకోసం 65, డబల్ బెడ్ రూమ్ల కోసం 198, రేషన్ కార్డుల కోసం 36, బీడీ కార్మికుల జీవన భతికి 17, ఇల్లు మంజూరు కోసం 117 దరఖాస్తులు అందజేశామన్నారు. ఈ దరఖాస్తుదారులం తా ఈ నెల 20న తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారని గుర్తు చేశారు. సమస్యలను వెంటనే విచారించి, అక్టోబర్ 15 వరకు ఈ సమస్యను పరిష్కరిం చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కురుమయ్య, పరమేశ్వరాచరి, గట్టయ్య, బాలరాజు, రాములు, మదన్, కురుమయ్యలు తదితరులు పాల్గొన్నారు.