Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో బాపూజీకి నివాళులర్పంచిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు
నవ తెలంగాణ-వనపర్తి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ఉద్యమానికి ఊపిరి పోసి యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అం దరికీ అందినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని జిల్లా పరి షత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి సూచించారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నేటి సమాజానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంద న్నారు. సమ సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని, అస్పశ్యత, అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారని కొనియాడారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడు తూ... ఆయన ఆశయాల ను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసు కోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, ము న్సిపల్ చైౖర్మన్ యాదవ్, జిల్లా అధికారులు, బీసీ సహాయ అధికారి సుబ్బా రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మజ రా ణి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ పోరాటంలో చాలా కీలకమైన వ్యక్తి అని తెలంగాణ కొరకు మంత్రి పదవి ని కూడా త్యాజించిన గొప్ప మానవతావాదని కొనియాడా రు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, డిప్యూటీ సీఈవో డీఎం సివిల్ సప్లై జిల్లా లేబర్ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పారిశ్రామిక అధికారి, కలెక్టరే ట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిన్నంబావి: మండలంలో మంగళవారం బహుజ న్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు దేవని రాజు ఆధ్వర్యం లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా హాజరై బూర్గుల ముని స్వామి మాట్లాడు తూ.. తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని సైతం లెక్క చేయ కుండా రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహానియుడని కొనియాడారు. అంతకు ముందు బాపుజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బాలు, వెంకటేష్, కృష్ణ, సాయికుమార్, స్వాములు, శివకృష్ణ, శ్రీని వాసులు, శ్రీను పాల్గొన్నారు.
అమరచింత: మున్సిపాలిటీలో మంగళవారం బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి మున్సిపల్ చైర్ పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్ నివా ళులర్పించారు. కార్యక్రమంలో నాగభూషణం గౌడు సాయి ఆదిత్య, ప్రభాకర్, రవి నాయక్ పాల్గొన్నారు.
కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి పట్టణంలో పలుచోట్ల మం గళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వ హించారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ మనో హర, విజరు గౌడ్ తదితరులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
కందనూలు: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, పద్మశాలి సంఘం నాయ కు లు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారుల ఆహ్వానం మేరకు కలెక్టరేట్ భవనంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ అరవింద్ చారి పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పద్మశాలి జిల్లా సంఘం నాయకులు పాల్గొన్నారు.
ధరూర్: మండలంలోని మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీని స్పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కృషి చేయాని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం జయంతి సందర్భంగా కలెక్టరేట్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శా ఖ అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా లక్ష్మ ణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. సమావేశంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్వేత ప్రియ దర్శిని, జిల్లా అధికారులు, పద్మ శాలి సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
ధరూర్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుడు తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమ నాయకుడు అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీ విజరు, జెడ్పీ టీసీలు రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాబర్, గోవిందు, కౌన్సిలర్స్ మురళి, నరహరి శ్రీనివాసులు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
కందనూలు: తెలంగాణ సాయుధ పోరాటంలో తన వంతు కృషిచేసి ఆదర్శంగా నిలిచిన పోరాట యోధుడు ఆచార్య శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ అదనపు కలెక్టర్ ఎస్ మో తిలాల్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవి ధంగా బీసీ డిస్టిక్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యుడు హాజరై చితప్రటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో పద్మశాలి గౌరవ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాసులు జా తీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లి కుంభం మల్లేష్ గౌడ్, రవీందర్ గౌడ్, వెంకటేశ్వర్లు లక్ష్మయ్య, కొట్ర శ్రీనివాసులు, అరవింద చారి పాల్గొన్నారు.
తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో
జిల్లా కేంద్రంలోని మంతటి గోపి మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భం గా పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యఅ తిథిగా తె లంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ దం డోరా జిల్లా అధ్యక్షురాలు బాకి రేణుక, భీమయ్య మా దిగ, ములకలపల్లి శ్రీను, కృష్ణయ్య, పాదాల మధు, తెలంగా ణ దండోరా నాయకులు పాల్గొన్నారు.
కందనూలు: జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వద్ద ప్రభు త్వ డిగ్రీ అండ్ పీజీ సైన్స్ కళాశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ కమర్ షాజహాన్ కళాశాల పూలమాల వేసి ళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాసులు, రాజు ఆంజనే యులు, దశరథం, శైలజ ప్రతాప్రావు పాల్గొన్నారు
పెబ్బేరు: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది అని ము న్సి పల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయి అన్నారు. అనం త రం బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసినివాళుల ర్పిం చారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ చిన్న ఎల్లారెడ్డి, గోపిబాబు, వెంకట్రాములు, సత్యనా రాయణ పాల్గొన్నారు.
గట్టు : మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలోలి ఆఫీసర్ కె ఎస్ రాజు అధ్యాపకులు రాజగోపాల్, శ్యాంసుందర్, ఆంజనే యులు, మహేష్, లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు
కొత్తకోట: కొత్తకోట పద్మశాలి సంఘం, బీఎస్పీ పార్టీ, టీఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్ర మంలో పద్మశాలి సంఘ సభ్యుడు సంబారి శ్రీనివాసులు, సూర చంద్రశేఖర్, బాలస్వామి, సత్యనారా యణ, శ్రీనివా సులు, బాలరాజు, వెంకటేష్, వెంకటస్వామి,పాల్గొన్నారు.
జడ్చర్ల : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, బిసి సీన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవులు మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోసిస్తూ చలి ని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన నికార్సయిన తెలంగాణ ఉద్యమకారు డు అని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షుడు తెలుగు సత్యయ్య, ఏఐటీయూసీ బాగి కృష్ణ యాదవ్, బీసీసేన నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగం పేట్ శేఖర్,బీసీసేన మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లె మోని నిరంజన్, పెద్దపల్లి శ్రీనివాస్ యాదవ్, గోపాల్, మాచారం శ్రీను, సురభి విజరు కుమార్, పోలేపల్లి రాఘ వేందర్, రాఘవేందర్, ఎర్ర ఆనంద్, గోనెలరాధాకృష్ణ, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.