Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూరు
విజయవాడలో నిర్వహించే సీపీఐ మహాసభలకు కమ్యూనిస్ట్ ప్రతినిధులు, మేధావులు, 29రాష్ట్రాల సీపీఐ ప్రతినిధులు, 5రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ కమ్యూనిస్టు అతిరథ మహారథులు పాల్గొంటారని సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు తెలిపారు. అక్టోబర్ 14నుంచి 18వరకు 5రోజుల పాటు విజయవాడలో నిర్వహించే మహాసభలకు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మంగళవారం గోడపత్రికలను జిల్లా సీపీఐ కార్యాలయంలో వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భాం ఆంజనేయులు మాట్లాడుతూ.. విజయవాడలో నిర్వహించే జాయతీ మహా సభలకు ప్రపంచ దేశాల నుంచి కమ్యూనిస్ట్ ప్రతినిధులు పాల్గొంటారని, మేధావులు ఆర్థికవేత్తలు ఈ దేశ29రాష్ట్రాల సీపీఐ అతిరథ మహారథులు, 5రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నర్సింహులు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు జంబయ్య, వెంకటస్వామి, కార్యకర్తలు మౌలాలి బాబు, రాజేశ్ ాల్గొన్నారు.