Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరచింత : మండల అభివృద్ధికి అధికారులు సహకరించాలని మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అమరచింత మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. అమరచింత మండల అభివృద్ధికి అధికారులు పార్టీలకు అతీతంగా ప్రజానీకం సహకరించాలని ఆయన పేర్కొన్నారు. నా వంతు బాధ్యతగా మండల అభివృద్ధి కోసం ఎన్నిలైన సరే సంక్షేమ పథకాలను తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ విధంగా అమరచింత లో డ్రైనేజ్ వ్యవస్థను, మంచి నీటి సమస్యను తలెత్తకుండా అధికారులు త్వరత్వరగా పరిష్కరించా లన్నారు. ముఖ్యంగా మండలంలో ఉన్న సమస్యలను ఏ సమస్య అయినా సరే పెండింగ్ లో ఉందని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, ఎంపీపీ చుక్క మాలతి, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎస్ ఏ రాజు, ఎంపీడీవో జ్యోతి, గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, పలువురు పాల్గొన్నారు.