Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుదూర గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు
- సంతతో తగ్గనున్న నిత్యావసర సరుకుల ధరలు
- అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాటు చేయాలి
- ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి : ప్రజలు
నూతన మండలం ఏర్పాడి 6 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ గ్రామాల్లో వారాంతపు అంగడి లేక మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారానికి ఒకసారి ఏర్పాటు చేసే సంతతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంతో పాటు పోటీ పెరిగి కూరగాయల ధరలు కూడా తగ్గుతాయి.దీంతో సుదూర గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయి అన్ని నిత్యావసర వస్తువులు ఒకేదగ్గర దొరుకుతాయి. దీంతో ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది.ప్రయాణ ఖర్చలు ఇతర ఖర్చులు వెచ్చించి పట్టణాలకు వెళ్ళవలసిన పనిలేకుండా పోతుంది.అన్ని సరుకులు అందుబాటులో ఉండటంతోపాటు సౌకర్యంగా ఉంటుంది.
నవతెలంగాణ-పదర
పదర మండలంలోని 10 గ్రామపంచాయతీల పరిధిలో దాదాపు 20 వేల జనాభా నివసిస్తున్నారు. మద్దిమడుగు, ఇప్పలపల్లి, గానుగ పెంట,మారాడుగు, ఉడిమిళ్ల,చిట్లంకుంట, చెన్నంపల్లి, వంకేశ్వరం, జ్యోతి నాయక్ తండా, తదితర గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకులు కొనాలన్నా అచ్చంపేట పట్టణాన్ని వెళ్ళవలసి వస్తుంది.దీంతో ప్రయాణ ఖర్చుల తోపాటు నిత్యావసరాల ఖర్చులు భారంగా మారుతుంది. మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారాడుగు గ్రామాల ప్రజలు 140 కిలో మీటర్లు ప్రయాణిస్తే తప్ప నిత్యావసరాలు కొనలేని పరిస్థితి నెలకొన్నది మండల కేంద్రంలో వారాంతపు సంత ఏర్పాటు చేస్తే సుదూర గ్రామాల ప్రజలకు ప్రయాణం ఖర్చులు తగ్గి అన్ని నిత్యావసర వస్తువులు ఓకే దగ్గర దొరుకుతాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.దీంతో ఇబ్బందులు తొలగుతాయని ఆయ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మండల కేంద్రం అభివృద్ధి చెందుతుంది
వివిధ గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయి.మా వ్యాపారాలు మరింత మెరుగు పడతాయి.మండల కేంద్రం మరింత అభివధి చెందు తుంది.
- బొడ్డుపల్లి పద్మమ్మ, పదర
గ్రామాల ప్రజలకు ఇబ్బందులు పోతాయి
గ్రామాల ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగి ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి. దీంతో నిత్యవసర వస్తువులు సామాన్య ప్రజలకు అందు బాటులో ఉంటాయి. వ్యాపారం చేసుకునే వారికి ఉపాధి అవకాశాలు మెరు గవుతాయి. సంబంధిత అధికారులు స్పందించి మండల కేంద్రంలో వారాంతపు అంగడి ఏర్పాటు చేయాలి.
- గోలి శ్రీనివాసులు, పదర
చిరువ్యపారులకు జీవనోపాధి దొరుకుతుంది
నిత్యావసర సరుకులు కూర గాయలు, పండ్లు,మాసం తదితర సరుకులు తక్కువ ధరకే దొరుకుతాయి.గ్రామపంచాయతీ అభివద్ధికి నిధులు చేకూరు తాయి. అన్ని వస్తువులు సంతలో దొరుకుతాయి కాబట్టి పట్ట ణాలకు వెళ్ళవలసిన పనిలేద.వెంటనే ఏర్పాటు చేయాలి.
- పొకలకారి రామోజీ, పదర
ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటా
ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాను. చాలా రోజులుగా అనుకుంటున్నాను ఏర్పాటు చేయాలని. చాలా మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.చిరు వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశం. ఆయా మండలాల్లో వారాంతపు అంగడిని పరిశీ లించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను.
- సర్పంచ్ ప్రవీణ్, పదర