Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -మహబూబ్ నగర్
పిల్లలకు చిన్న వయసులోని పర్యాటక రంగంపై అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని అప్పన పల్లిలోని కెేసీఆర్ ఏకో పార్కులో పర్యాటక వేడు కలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు ఏడాదిలో ఒక్కసారైనా ఒకటి లేక రెండు పర్యాటక కేంద్రాలను సందర్శించి అక్కడే విషయాలను వివరించాలని కలెక్టర్ తెలిపారు. అప్పుడే పర్యాటక రంగంపై అవగాహన కలుగుతుందని వారు అన్నారు. ఇప్పుడు మహబూ బ్‌నగర్ జిల్లాల్లో కూడా పర్యాటక కేంద్రాలు అభివృద్ధిలోకి వస్తున్నాయని వారు తెలిపారు. శిల్పా రామం ట్యాంక్ బడ్ నెక్లెస్ రోడ్ సస్పెన్స్ బ్రిడ్జి మన్నెంకొండ దేవస్థానం దగ్గర టూరిజం హౌటల్ ఏ కేసీఆర్ ఏకోపార్కు పిల్లల మరి ఇలా అనేక పర్యా టక కేంద్రాలు అందు బాటులో ఉన్నాయని వారు తెలిపారు. బాల భవన్ విద్యార్థులు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ రెవెన్యూ అదన కలెక్టర్ సీతారామారావు డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వనపర్తి : వనపర్తి జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. మంగళవారం ఐడిఓసి ప్రజావాణి సమావేశ మందిరంలో ''ప్రపంచ పర్యాటక దినోత్సవం'' సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1980 నుంచి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్థున్నట్లు ఆమె తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఈవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనంలో గెలుపొందిన విజేతలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. . విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని, విజ్ఞానాన్ని, పర్యా టక విషయాలపై ఆసక్తినీ పెంపొందించు కోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్, టూరిజం అధికారి యం.ఎ.రషీద్, జిల్లా అధికారులు, విద్యార్థులు, పాల్గొన్నారు.