Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్‌కు రైతుల వినతి
నవతెలంగాణ- బిజినేపల్లి
మండల కేంద్రం నుంచి హైదారాబాద్ వెెళ్ళే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ ఎత్తు తగ్గించాలంటూ మంగళ వారం సమీప పోలాల రైతులు తహసీల్దార్ అంజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిడ్జీని 10 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తుండడంతో చుట్టు పక్కల పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉన్న బ్రిడ్జీతోనే ఇబ్బందులు పడుతుంటే మరో బ్రిడ్జీ నిర్మాణానికి అధికారులు పరిశీలించారని ఒక్కదాంతోనే ఇబ్బందులు పడుతుంటే మరోటి నిర్మిస్తే సమస్య జఠిలమై తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జీ ఎత్తు తగ్డించడంతో పాటు బ్రిడ్జ్ నిర్మాణం కోసం పలుగు తిప్ప నుండి మొర్రం తరలింపును నిలిపి వేయా లని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో పిట్టల బాలరాజు , జోజిరెడ్డి, సందీప్‌రెడ్డి , కత్తె కవిత, రవి తదితరులు ఉన్నారు.