Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి శివవర్మ
నవతెలంగాణ- కొల్లాపూర్
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని, అనుమతి లేని ఆస్పత్రులను తక్షణమే సీజ్ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బి.శివవర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్ పట్ట ణంతో పాటు మండలంలో విచ్చలవిడిగా అనుమతుల్లేని ప్రైవేట్ హాస్పిటల్ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆస్పత్రుల్లో ఎలాం టి వసతులు లేకున్నా, టెస్టుల పేరుతో నిర్వాహకులు పేద ప్రజలు అని చూడ కుండా ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఆర్ఎంపీలు కూడా ఎంబిబిఎస్ డాక్టర్లగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని అరికట్టాలని, అనుమతులు లేని ఆస్పత్రులను సీజ్ చేసి నిర్వాహకులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీపీిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడ్గామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బి.బాలపీరు, ఎండి.సలీం, భాస్కర్ నాయక్, రాజు, శివశంకర్, సేవ్య నాయక్, రాజకుమార్, మల్లేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.