Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లమల్ల ప్రాంతంలో అనుమతులులేని స్కీంలు, ఎంటర్ప్రైజెస్, చిట్టీల దందా
- కోట్ల రూపాయలతో ఉడాయిస్తున్న నిర్వహకులు
- మోసపోతున్న అమాయక జనం
నెలకు రూ.1వెయ్యి చెల్లిస్తే కారు, బైక్, బంగారం, వాషింగ్‌మిషన్ వంటి విలువైన వస్తులు ఇస్తామని, డ్రాలో మీ పేరు వస్తే కంతులు చెల్లించాల్సి అవసరం లేదంటూ కొందరు లక్కీ స్కీం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా ఆకర్షణీయమైన బ్రోచర్లతో ప్రచారం చేసి వందలాది మందిని చేర్చుకొని మొదట కొంత మందికి బహుమతులు ఇచ్చి అనంతరం అప్పుడూ ఇప్పుడూ అంటూ కాలయాపని చేసి కోట్లాది రూపాయలతో ఉడాయిస్తున్నారు.
నవతెలంగాణ -అచ్చంపేట
నల్లమల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో అనుమతులు లేకుండా లక్కి స్కీమ్‌ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రతి నెల ఎనిమిది మందికి నగదు, కారు, బైక్, బంగారం, వాషింగ్ మెషిన్లు, తదితర బహుమతులు అందిస్తామంటూ వేలాది మంది దగ్గర నెలకు రూ.1000 చొప్పున వసూలు చేస్తూ కోట్ల రూపా యలతో ఉడాయిస్తున్నారు. అచ్చంపేట పట్టణంలో రెండు నెలల క్రితం ముగ్గురు వ్యక్తులు లక్కి డ్రా పేరుతొ వేలాది మంది ప్రజలతో నెల నెల రూ.1000 చొప్పున వసులు చేశారు. గడువు గడిచిన లబ్దిదారులకు వస్తువులు ఇవ్వడ కుండా ఇబ్బందులు పెట్టారు. దీంతో బా ధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సభ్యు లందిరికీ వస్తు వులు అందిస్తామని నిర్వాహకులు పోలీ సుల ఎదుట ఒప్పుకొ ని మోసం చేశారు. నిర్వాహకులు దాదా పు రూ.3.కోట్లు వ సూలు చేసినట్లు సమాచారం.
తాజాగా లింగాల మండలంలో కొందరు అయ్యప్ప ఎంటర్ ప్రైజెస్ పేరున బ్రోచర్లు ముద్రించి సమీప గ్రామాల ప్రజలతో మెంబర్ షిప్ చేయించుకొని నెల నెలా డబ్బులు కట్టించుకున్నారు, గడువు ముగిసినా సభ్యులకు వస్తువులు ఇవ్వకుండా పొంతన లేని సమాధా నాలు ఇస్తూ కాలయాపన చేస్తుండడంతో బాధితులు సోమవారం ధర్నా చేపట్టి నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాహకులు దాదాపు రూ.2కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
నిబంధనలకు విరుద్దంగా, అనుమతులు లేకుండా చిట్టీిల వ్యాపారం, లక్కి డ్రా, స్కీంలు నిర్వహిస్తున్న వారి పైన నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకొని అమాయక ప్రజ లు మోసపోకుండా చూడాలని నియోజకవర్గ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
అనుమతులు లేకుండా నిర్వహిస్తు న్న లక్కీ స్కీంల గురించి అచ్చంపేట సీఐ అనుదీప్‌ను వివరణ కోరగా మో సం చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అనుమతులు లేకుండా చిట్టిలు, లక్కి డ్రాలు, ఇతర స్కీం లు నిర్వహించే పారిపై కఠిన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. గతంలో అచ్చంపేటలో ఒక కేసు నమోదు చేశామని తెలిపారు.
- అనుదీప్ , అచ్చంపేట సీఐ