Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సమాజ మార్పు కోసం గుర్రం జాషువా కవిత్తం ఉపయోగపడుతోంది. ఆనాటి కాలంలోనే కులవివక్ష, సామాజిక అసమానతలపై ఆయన కవిత్వం ద్వారా నిర్మూలన చేసే ప్రయ త్నం చేశారని కేవీపీఎస్ నాయకులు సత్యం, వ ుల్లెల మాణిక్యం అన్నారు. జాషువా జయంతిని సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... జాషువా తండ్రి దళితుడు తల్లి బీసీ అని వీరు అప్పట్లోనే ఆదర్శ వివాహం చేసుకు న్నారని గుర్తు చేశారు. వీరి పుత్రుడు జాషువా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడని వారన్నారు. గతంలో సీనిమాలు ఉండేవి కావని తోలుబొమ్మలాటలు బాగా ఆడించేవారని వీటికి జాషువా సంద ర్బాన్ని బట్టి వాక్యాన్ని చేసేవా డని గుర్తు చేశా రు. ఉపాధ్యాయ, ఆకాశ వాణి తధితర శాఖల లో తక్కువ వేతనంతో ఉద్యోగం చేసి కుటుం భాన్ని పోషన చేసేవాడని వారు అన్నారు. సమాజిక కోణంలో అనేక రచ నలు కేసినందు న ఇష్టం లేకున్నా... అవమా నాలకు గురిచి చేసిన వారే అతన్ని పద్మభూ షణ్ ఇచ్చి గౌర వించిందన్నారు. రాజుకుల గాకుండా ప్రజల తరుపున రచనలు, కవితలను రాయలని ఆనాడే ఆయన తన రచన కొనసా గించాడని తెలిపారు. దేవాలయంలో దళితుల ప్రవేశం లేకపోవడంతో ఆయన గబ్బిలం అనే పుస్తకం లో వివక్ష తీరుతెన్నులపై తన రచనలు కొనసా గించాడని తెలిపారు. ఒక రోజు రైలు ప్ర యా ణం చేస్త్ను జాషువా పక్కల కూర్చన్న మరో వ్యక్తి ఇతని కవితలు చూసి మెచ్చుకున్నాడు. అయితే జాషువా కులం తెలుసుకున్న తర్వాత అతన్ని దూరం పెట్టారని గుర్తు చేశారు. ఇన్నెళ్లుగా ఆయన కవిత్వం ప్రజల నాల్కలందు జీవిస్తునే ఉందన్నారు. తరతరాలుగా ఆయన కవిత్వం ప్రజల మీద ప్రభావం చూపుతూనే ఉందా న్నా రు. తన కాలంలో వస్తున్న కవిత్వానికి మించి ప్రత్యమ్నాయ కవిత్వం రాసి చూయిం చాడని గుర్తు చేశారు. కృష్ణశాస్త్రీ, రాయపోలు ఆద్వర్యం లో బావకవిత్వం వచ్చేది. విశ్వనాథ సత్యనారాయణ నుంచి హిందు ఒరవడి కూడిన కవిత్వం వచ్చేది. శ్రీశీ కవిత్వం నుంచి అభ్యుదయం వచ్చేది. ఈ మూడు కోణాలకు బి న్నంగా తన కవిత్వం కొనసాగించాడని గుర్తు చేశారు. జాషువా అడుగు జాడల్లో సమాజంలో ఉన్న కుల మత కుల్లును కడిపారేసేందుకు కలి సి రావాలని వారు పిలుపు నిచ్చారు. కార్యక్ర మంలో ఆదివిష్ణు, బాను, నవతెలంగాణ మేనేజ ర్ కార్తీక్ తధతరులు పాల్గొన్నారు.
కందనూలు: జిల్లా కేంద్రంలో అంబేద్క ర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధ వారం గుర్రం జాషువా జయంతి సం దర్భం గా జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న జాషువా చిత్ర పటానికి పూలమాల నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని కుల వివక్షను, అంటారానితనాన్ని నిరసిస్తూ గుర్రం జాషువా ఎన్నో రచనలు చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని గుం టూరు జిల్లా వినుకొండలో జన్మించి తెలుగు సాహిత్యంలోనే కాక ప్రపం చస్థాయి మానవతా వాది, ప్రజాక వి, కవికోకిలగా ప్రజలలో స్థిర స్థాయిని ఏర్పర చుకున్నారన్నారు. జాషువాను తలచుకోవడం అంటే వారి జీవిత ఆ చరణను కొనసాగిస్తే అస లైన నివాళి అన్నారు. కార్యక్రమంలో నాయ కులు అంతటి చంద్రయ్య, మన్యం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.