Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన
- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నవతెలంగాణ-పదర
పేదల కష్టం తెలిసినోడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఆసరా పింఛన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయంలో పేదలకు న్యాయం జరగలేదని, రాష్ట్రం లో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఆసరా పింఛన్లతో వద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు భరోసా కల్పిస్తుందని తెలిపారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు భారం కావద్దని సీఎం కేసీఆర్ మీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీంతో ఎంతోమంది కుటుంబాలలో వెలుగును నింపాలని కొనియాడారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చి దిద్దుతున్నారని ప్రశంసించారు. దేశంలో కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని అని, సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తుందన్నారు. ప్రణాళిక బద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామని పేర్కొన్నారు. అనంతరం మండల వ్యాప్తంగా 52 మంది అబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, 354 మంది నూతన ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో శంకర్ నాయక్, రెవెన్యూ సిబ్బంది లక్ష్మి, ఎంపీపీ బిక్య నాయక్, జెడ్పీటీసీ రాంబాబు నాయక్, మండల అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, విండో డైరెక్టర్లు శంకర్, రమేష్, ఎంపీటీసీ ఎల్లమ్మ, సునీత పాల్గొన్నారు.