Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.29 కోట్లు నిధులతో 9 కిలోమీటర్ల సీసీ పనులు
- మూడు కిలోమీటర్ల పనులు పూర్తి
- ప్రపోజల్లో మరో మూడు కిలోమీటర్లు
నవ తెలంగాణ- వనపర్తి
పట్ఠణంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా బీటీ రోడ్డుగా ఉన్న మహిళా డిగ్రీ కళాశాల రోడ్డును సీసీ రోడ్డుగా మార్చారు. గతంలో ఉన్న బీటీ రోడ్డులో నల్లాల కోసం, ఇతర పనుల నిమిత్తం తవ్వకాలు చేపట్టడంతో రోడ్డంతా పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం పట్టణంలో మిషన్ భగీరథ పథకం కింద ఈ పనులు చేపడుతున్నారు. మరికొన్ని చోట్ల సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడు కిలోమీటర్ల మేరకు సీసీ పనులు కొనసాగుతున్నాయి.
రూ.29 కోట్లునిధులతో 9కిలోమీటర్ల సీసీ పనులు
వనపర్తి పట్టణంలో పలు వార్డుల్లో రోడ్లన్నీ ధ్వం సమ య్యాయి. కనీసం టూ వీటర్లు వెళ్లడానికి కూడా ఎగుడు దిగుడు రోడ్లతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో మిషన్ భగీరథ కింద రూ.29 కోట్ల నిధులు కేటాయించారు. అత్యవసరంగా, పూర్తిగా పాడైన రోడ్లను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని పనులు చేపడుతున్నారు.
మూడు కిలోమీటర్ల పనులు పూర్తి
వనపర్తి పట్టణంలో బాలుర జూనియర్ కళాశాల నుంచి పీర్ల గుట్ట వరకు విశాలంగా సీసీ రోడ్డు పనులు చేశారు. ఈ రోడ్డు రావడంతో ఆ కాలనీ వాసులకు ఇబ్బందులు తొలగా యి. 25 పీట్ల వరకు మొదటి, రెండు లేయర్లు వేయడంతో రోడ్డంతా విశాలంగా మారింది. అలాగే పెబ్బేరు రోడ్డు నుంచి చందాపూర్ వెళ్లే మార్గంలో పీర్లగుట్ట వరకు సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఇక్కడ కూడా దాదాపు 20 నుంచి 25 పీట్ల వరకు సీసీ రోడ్డు వేశారు. అలాగే ఆర్టీసీ డిపో ముందు భాగంలోని రోడ్డు నుంచి ఎస్పీ కార్యాలయం వరకు సీసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ రోడ్ల నిర్మాణంలో ఇటు వాహనదారులు, అటు ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోయాయి.
కొనసాగుతున్న సీసీ పనులు
పట్టణంలో నాలుగు మార్గాల్లో మూడు కిలోమీటర్లు మేర సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుంచి వీకేర్ హాస్పిటల్ వరకు రెండు లైన్ల మేరకు 24 ఫీట్ల సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నా యి. ఇప్పటి వరకు మొదటి లేయర్ పనులు పూర్తవగా ఒక పక్క రెండో లేయర్ పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే పాన్‌గల్ చౌరస్తాలోని అంబేద్కర్‌నగర్ నుంచి లిటిల్‌బడ్స్ స్కూల్ మీదుగా కాశీనంగర్ రోడ్డును కలుపుతూ మట్టిత వ్వకం పనులు పూర్తయ్యాయి. మరో రోడ్డు బీఎస్ఎన్ఎల్ కా ర్యాలయం నుంచి వీకేర్ హాస్పిటల్ వరకు ఇప్పటికే మొద టి లేయర్ సీసీ పనులు పూర్తయ్యాయి. కొత్తబస్టాండ్ పక్కల నున్న పాత కలెక్టర్ బంగ్లా పక్కనున్న బీటీ రోడ్డును సీసీగా మారుస్తూ 25 పీట్ల మేరకు మొదటి లేయర్ సీసీరోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. ఈ నాలుగు మార్గాల్లో వారం పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెబు తున్నారు.
ప్రపోజల్లో మరో మూడు కిలోమీటర్లు
వనపర్తి పట్టణంలో మరో మూడు కిలోమీటర్ల మేరకు సిసి రోడ్డు పనులు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రపోజల్స్ పంపారు. పట్టణంలో మరీ ఇబ్బందికరంగా ఉండే రోడ్లతో పాటు జనావాసాలున్న రోడ్లను ఎంపిక చేసి వాటిని కూడా 20 నుంచి 24 ఫీట్ల రోడ్డును నిర్మించనున్న ట్లు అధికారులు చెబుతున్నారు.
పనులు పూర్తి చేస్తాం
వనపర్తి జిల్లా కేంద్రంలో ఇప్పట ికే మూడు కిలో మీటర్ల మేరకు సీసీ రోడ్డు పనులు పూర్తి చేశారు. మ రో మూడు కిలో మీటర్ల వరకు పనులు కొనసా గుతున్నాయి. ఇం కా మూడు కిలో మీటర్ల మేరకు అధికారులు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. అనుమతులు వచ్చిన వెంట నే పనులు ప్రారంభిస్తాం. ప్రస్తుతం తవ్విన రోడ్ల దగ్గర ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటే అక్కడక్కడా పనులు చేయిస్తాం.
- గంగుల విక్రంసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్, వనపర్తి