Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ధరూర్
గద్వాల తహసీల్దార్ ఆవరణలో గ్రామ రెవెన్యూ సహాయకుల సమ్మె 66వ రోజు చేరింది. బుధవారం వీఆర్ఏలు అందరూ పోస్ట్ కార్డులు రాసి ముఖ్యమంత్రి కి చేరే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ వీఆర్ఏ జేఏసీ అధ్యక్షులు బి రాములు ,జేఏసీ కన్వీనర్లు ఎం వెంకటేశ్వర్లు కావాలి మహేష్ గద్వాల మండల ప్రధాన కార్యదర్శి కే గోవర్ధన్ వీఆర్ఏలు నరసింహులు వెంకటేష్, మొగిలి , వీరన్న ఆంజనేయులు దేవమ్మ బజార్ అమ్మ ఉప్పు రాములు మహబూబ్ పరుష ఉప్పల రాములు వీఆర్ఏలు పాల్గొన్నారు
ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ముందర గత 65 రోజులుగా నిర్వహిస్తున్న వీఆర్ఏల సమ్మె గురువారం 66వ రోజుకు చేరింది కార్యక్రమంలో గోవిందు, బి శ్రీనివాసులు, గట్టన్న,పరుశురాం, రాములు, ,కురుమన్న ,రంగన్న ,రమేష్ ,తిమ్మక్క, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
బల్మూరు : వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 66 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రిలే దీక్ష కార్యక్రమాలలో వీఆర్ఏ సంఘం నాయకులు జహంగీర్ వెంకటయ్య తిరుపతయ్య ఉన్నారు.
కందనూలు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల గా జరుగుతున్న వీఆర్ఏల సమ్మె 66 రోజులు విజయవంతంగా కొనసాగుతుంది .కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసి జిల్లా కో కన్వీనర్ లు సాయి మల్లేష్ ధర్మేందర్ కాజా భాను శోభారాణి నిరంజన్ బంగారయ్య బాలస్వామి శేఖర్ సలేశ్వరం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.