Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిడ్జిల్ : బిజెపికి ఓటేస్తే మోటార్లకు మీటర్లే బీగిస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. కంద్ర ప్రభుత్వ అనుచత విధానాలతోనే దేశంలో నిత్యవసర ధరలు, పెరిగి పేద ప్రజల నడ్డి విడుస్తుందని పేదల పొట్ట కొట్టి బడా బాబులకు ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం పంచి పెడుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకోబడ్డారు. బుధవారం మండలంలోని మసుగుండ్లపల్లి వేముల కొత్తూరు రాణి పేట వస్పుల్ గ్రామాలలో సర్పంచులు సుమతమ్మ గోపాల్ రెడ్డి, జంగయ్య, రాధిక ప్రతాపరెడ్డి, నిరంజన్, మధుసూదన్ రెడ్డి, సరిత తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం బతుకమ్మ చీరలు ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. మసిగొండ్లపల్లి గ్రామంలో 17 లక్షల రూపాయలతో నూతన పాఠశాల ను చింటోర్యం, కొత్తూరు గ్రామంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు, అనంతరం ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు మహిళలతో కలిసి బతుకమ్మ వేశారు. అనంతరం సీఎం ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాంతమ్మ బాలస్వామి, జెడ్పిటిసి శశిరేఖ బాలు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి ,పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ రాజీవ్ రెడ్డి ఎంపీడీవో సాయి లక్ష్మి ఎం పి ఓ, అనురాధ, వ్యవసాయ అధికారి సిద్ధార్థ , పంచాయతీరాజ్ ఏఈ, అశ్రిత్రారు సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు జంగారెడ్డి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఎంపిటిసిల సంఘం మండల అధ్యక్షులు సుదర్శన్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు యాదవ్ ఎంపీటీసీలు యశోద , రాజారెడ్డి టిఆర్ఎస్ నాయకులు బాల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ,బాబా, కార్మిక సంఘం మండల అధ్యక్షులు డానియల్, వెంకట సాగర్ సుకుమారు శ్రీనివాసులు ఉప సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు మతిన్, శ్రీనివాసులు, మంగలి నరసింహ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.