Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నర్వ : రైతులు సొసైటీ అభివృద్ధికి సహకరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారము నర్వ పిఎసిఎస్ చైర్మన్ బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్వజన మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘంలో గతం నుండి పొందినటువంటి లాంగ్ టర్మ్ రుణాలను షార్ట్ టర్మ్ రుణాలు గా మార్చుకొని ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలను పొంది రైతులు అభివృద్ధి చెందాలి అన్నారు. ఇంతకుముందు నష్టాల్లో ఉన్న సొసైటీ లాభాల్లో ఉందన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా నే అన్ని బ్యాంకులు అందిస్తున్న రుణాలను కూడా మన సొసైటీ తరఫున తక్కువ వడ్డీకి అందించడం జరుగుతదన్నారు.గతంలో కేవలము వ్యవసాయానికి సంబ ంధించిన రుణాలు మాత్రమే ఇవ్వడము జరుగుతుంది.ఈ సంవత్సరం నుండి సంఘం ఆధ్వర్యంలో హౌసింగ్ లోన్ లు, ఎడ్యుకేషన్ లోన్ లు కూడా అందించడం జరుగు తుందని ఇట్టి అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత 30 సంవత్సరాలుగా సొసైటీలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తూ కరుణ ద్వారా మరణించిన బాలకిషన్ కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని,ఎమ్మెల్యే అందజేశారు. అంతకంటే ముందు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయరాములు శెట్టి, జడ్పీటీసీ గవిని జ్యోతి, వైస్ ఎంపీపీ వీణ వతి,పిఎసిఎస్ వైస్ చైర్మన్ లక్ష్మణ్, మండల రైతు బంధు అధ్యక్షుడు చిన్నయ్య, ఆయా గ్రామాల డైరెక్టర్లు శ్రీనివాస రెడ్డి, వివేకానంద రెడ్డి, పల్లె శేఖర్, లింగన్న, అనసూయమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, నాయకులు కిరణ్ ప్రకాష్ రెడ్డి,శంకర్, సిబ్బంది జగదీశ్వర్ రెడ్డి, ఉదరు, రాజు, సునీల్ ఆయా గ్రామాల రైతులు, టిఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.