Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కంద నూలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 115వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ భగత్ సింగ్ నేను నాస్తికుని ఎలా అయ్యాను అనే పుస్తకంలో మతోన్మాదం పై తన వైఖరిని స్పష్టంగా చెప్పారని తెలిపారు. నాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లు యువతను దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. .భగత్ సింగ్ విగ్రహాన్ని పార్లమెంట్లో నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని వారు కోరారు. భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్ర మంలో సిఐటీ యూ జిల్లా నాయకులు అశోక్ హమాలి యూనియన్ నాయకులు కురుమయ్య ధర్మేందర్ వెంకటస్వామి వెంకటయ్య మల్లయ్య రామస్వామి పాల్గొన్నారు.
కందనూలు: స్వాతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం మండల కార్యదర్శి జి అశోక్ అన్నారు. బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయంలో భగత్ సింగ్ 115వ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ చంద్రమౌళి, సురేష్ ,జాంగిర్, భాను ,ఆసిఫా, మౌలానా ,భాను ప్రకాష్ ,తదితరులు పాల్గొన్నారు
ఆత్మకూరు. : ఆత్మకూరు పట్టణంలోని శ్రీనివాస కాలనీ నందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె .రాఘవ మాట్లాడుతూ.. భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ త్యాగం పోరాటం మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు నవీన్, భరత్, భాను ,వెంకట్ ,అరవింద, శివ సాయి ,రోహిత్, దుర్గాప్రసాద్, ఆదిత్య, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
నర్వ : భగత్ సింగ్ భారత స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడని ఎస్ఎఫ్ఐ నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ అన్నారు.బుధవారం భగత్ సింగ్ జయంతి సందర్భంగా నర్వ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏ ల తో కలిసి భగత్ సింగ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వీఆర్ఏల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.వీఆర్ఏలకు మద్దతు ప్రకటించారు కార్యక్రమము లో జిల్లా కో కన్వీనర్ రాములు, జనరల్ సెక్రెటరీ వెంకటన్న,మండల కో కన్వీనర్ సువర్ణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ధరూర్ : భగత్ సింగ్ ఆశయ సాధనకు నిరంతర పోరాటాలు. ఎస్ఎఫ్ఐ నాయకులు బత్తలయ,స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్పూర్తితో సమ సమాజ నిర్మాణానికి నిరంతరం భారత విద్యార్థి ఫెడరేషన్ పోరాటాలు చేస్తుందని నాయకులు బత్తలయా అన్నారు,భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా స్ధానిక కూరగాయల మార్కెట్ లో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జాషువా అశోక్ నంద కిషోర్, వేణుగోపాల్,అనిల్ ప్రవీణ్, హరికృష్ణ, జాన్సన్ ఉదరు పాల్గొన్నారు
కందనూలు : సర్దార్ భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ ఆశయాలు -మన కర్తవ్యాలు ''అనే అంశంపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్వకోల్ మద్దిలేటి ,పెబ్బేటి మల్లికార్జున్ మాట్లాడుతూ ఈ దేశానికి భగత్ సింగ్ యొక్క పోరాటాలు ఆశయాలు చాలా అవసరమని కొనియాడారు .భగత్ సింగ్ ఆశయాలను కేంద్ర ప్రభుత్వం కనుమరుగు చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో భరత్, కిరణ్ కుమార్ , లక్ష్మీపతి ,కురుమయ్య తదితరులు పాల్గొన్నారు..
ఉట్కూర్ : షహీద్ భగత్ సింగ్ ఆశలను కొనసాగిద్దామని పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కనక రాయుడు అన్నారు. మండలం పెద్దపొర్ల గ్రామంలో షాహిద్ భగత్ సింగ్ చిత్రపటాని పూలమాలలు వేసి 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పి వై ఎల్ ఏఐకేఎంఎస్ పిడిఎస్ యు నాయకులు మాట్లాడుతూ దేశం నుండి బ్రిటిష్ వలస పాలనను తరిమికొట్టి దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కొరకు ఒక మనిషిని వేరొక మనిషి దోపిడీ చేయని సమ సమాజాని సాధించాలని పోరాడిన వీర యోధుడు భగత్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హనుమంతు చిన్న బాలప్ప, కోలకృష్ణయ్య కృష్ణ, శివ , మహాదేవ్ శంకర్ వెంకటయ్య మశప్ప బుడ్డ కిష్టప్ప, కావాలి బలప్ప, బాలకృష్ణ నాయకులు నాగరాజ్ ప్రభుదేవా శివరాజ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు
ధరూర్ : భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా గద్వాల పట్టణంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానిక ఆధ్వర్యంలో పూలమాలలు వేసి,నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వంశీ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ పాషా , జిల్లా కమిటి సభ్యులు రాజు కుమార్,మన్యం, తిరుమలేష్,సుశాంత్,శ్యామ్, జిల్లా నాయకులు సాగర్, సురేంద్ర, అశోక్,జమన్న, రాజు,తదితరులు పాల్గొన్నారు
పానగల్ : ప్రజల కోసం ప్రాణాలొడ్డిన అమరుడు భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంతోష్ అన్నారు. బుధవారం పానగల్ మండలం కేతేపల్లి భగత్ సింగ్ నగర్ లో, భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య సీనియర్ నాయకులు మాల కుర్మయ్య, చిన్న కురుమయ్య, కురువ హనుమంతు, వార్డు నెంబర్ పెంటయ్య, కురువ పెంటయ్య, వేమన్న, యువజన నాయకులు కాకం రాముడు, రామాంజనేయులు, వెంకటస్వామి, లచ్చయ్య సంగనమోని రాముడు, కురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ : మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూని యర్ కాలేజి లో విశ్వ నరుడు గుఱ్ఱం జాషువా, షహీద్ భగత్ సింగ్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్య క్షులు మహేందర్ ,నాయకులు శ్రీకాంత్ అరుణ్ ప్రతీక విద్యార్థులు పాల్గొన్నారు..
అయిజ : మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం గ్రామంలో భగత్ సింగ్ జయంతి 115 వ వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని భగత్ సింగ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ వార్డు కౌన్సిలర్ శ్రీ రాములు ఏర్నాటు చేశారు. సుమారు 50 మందికి పైగా రక్తదానం చేసిన గ్రామ యువకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ నరేష్ కుమార్.. రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ తాహెర్, హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ భగత్‌సింగ్ యూత్ ను ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నందుకు అభినందించారు.
మహబూబ్ నగర్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేసేందుకు ప్రతి నిరుద్యోగి ఒక భగత్ సింగ్ కావాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి సురేష్ అన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ 115వ జయంతిని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగుల కలలు నెరవేర్చే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని వారు ఆరోపించారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ పట్టణ అధ్యక్షులు కృష్ణ సంతోష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కందనూలు : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ 115వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి శివ వర్మ పూలమాలలు వేశారు. అనంతరంసీఐటీయూ జిల్లాఉపాధ్యక్షులు పొదిల్ల రామయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తార సింగ్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్నలి లు మాట్లాడుతూ భగత్ సింగ్ నేను నాస్తికుని ఎలా అయ్యాను అనే పుస్తకంలో మతోన్మాదం పై తన వైఖరిని స్పష్టంగా చెప్పారని తెలిపారు. భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని వారు కోరారు. భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు లిఎం భాస్కర్ నాయక్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు యండి మహిముద్ నాయకులు సత్యం సత్యనారాయణ రెడ్డి శివ రవికుమార్ రాజు శివ శివశంకర్లి పాల్గొన్నారు.
వనపర్తి రూరల్ : వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో బుధవారం నాడు విశ్వ నరుడు. గుర్రం జాషువా విప్లవ వీర కిషోరం భగత్ సింగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ. మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత అని వారు చేపట్టినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పోరాటాలు కార్యక్రమాలు మన దేశానికి చేశారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాయక్ అంటే నరసింహ సిరిగిరి మన్యం ఎడవల్లి వీరప్ప ఈశ్వర్ డప్పు నాగరాజు స్వామిబేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సిరిగిరి మన్యం,వర్కింగ్ అధ్యక్షుడు ఎడవల్లి వీరప్ప, పి ఆర్ టి యు నాయకుడు రంగస్వామి, రాంబాబు, మాల మహానాడు నాయకుడు గోపాల్, తదితరులు పాల్గొన్నారు
, గట్టు : మండల కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె ఎస్ డి రాజు అధ్యాపకులు రాజగోపాల్ శ్యాంసుందర్ ఆంజనేయులు మహేష్ విష్ణు శేఖర్ మధు రాధిక మహేష్ నాన్ టీచింగ్ సిబ్బంది గోపాల్ మోహన్ రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.