Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా ధనం ఇష్టానుసారంగా ఖర్చు...?
- భారత వజ్రోత్సవ వేడుకల ఖర్చుల వివరాలను మున్సిపల్ కార్యాలయం నొటిస్ బోర్డు పైన ఉంచాలి
నవ తెలంగాణ- అచ్చంపేట
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 8.నుంచి ఆగష్టు 22.వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల ఉన్నత అధికారులు ఏఏ రోజున ఏఏ కార్యక్రమాలు చేయాలి. పాటించవలసిన నియమ నిభందనలు సూచిస్తు...జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.అందులో భాగంగా అచ్చంపేట మున్సిపాలిటీలో రెండు వారాల పాటు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించారు.ఏ కార్యక్రమానికి ఎన్ని నిధులు ఖర్చు చేశారు..! అనేది అదికారులు వెల్లడించడం లేదు .అయితే నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.విద్యుత్ దీపాల అలంకరణ, సాంస్కతిక కార్యక్రమాలు , బహుమతుల ప్రధానం, జెండా, కర్రలు, టోపీల, ప్లెక్సిలు, డ్రోన్ నిర్వహణ , ఛాయా, బిస్కెట్లు ,అవసరాలకు మించి ఇష్టానుసారంగా ప్రజా ధనం ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ఖర్చుల వివరాలను మున్సిపల్ కార్యాలయం నొటిస్ బోర్డు పైన ఉంచాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.నిర్వహణ నిధుల ఖర్చు పై మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్ ను నవతెలంగాణ వివరణ అడుగగా...బిల్లులు చెల్లించ లేదు.. చైర్మన్ ను అడిగి ఖర్చుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.