Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్ నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని, దీని అనుకూలంగా మార్చు కునేందుకు ప్రతిపక్షాల ఐక్యత కోసం సీపీఐ(ఎం) కృషి చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీి సాగర్ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలు ప్రజలను అష్ట కష్టాలపాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. రోజురోజుకి పెరుగుతున్న నిరుద్యోగ సమస్య పడిపోతున్న జీడీపీ పరిస్థితులు పెరుగుతున్నా యన్నారు. భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ,చైనా తో వైరుధ్యం వల్ల దేశంలో అంతర్గత ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు అన్నారు. ఆ దేశాలతో పోలిస్తే మనదేశంలోనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయని వారు గుర్తు చేశారు. అసంతృప్తి వస్తున్న నేపథ్యంలో ప్రతి పక్షాలపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఈడి కేసులు పెట్టడం విచారణ జరిపించడంతో లొంగ దీసుకునే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపించారు. జిల్లాలో ఇండ్లు ఇండ్ల స్థలాలు భూ పోరాటాలను విస్తృతపరచి పోరాటాలు నడిపించాలని సూచించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రాములు మా ట్లాడుతూ జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా నకిలీ డాక్యు మెంట్లు సృష్టించి పేదలకు అమ్ము కున్న మోసగాలను సహ కరించిన అధికారులపై పూర్తిస్థాయి విచారణ జరి పించి చర్యలు తీసుకోవాలని వారు డిమా ండ్ చేశారు. నిజమైన హరో దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలిపారు. 120 గజాలు ఉన్న స్థలం వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కిల్లే గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి. చంద్రకాంత్ ,రాజ్ కుమార్, జగన్,దీప్లా నాయక్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.