Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరచింత
భూ పోరాటానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని, అక్టోబర్ 1న అమరచింత మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం డి జబ్బర్ అన్నారు. బుధవారం అమరచింత మండలం కేంద్రంలోని పందిరి వేసుకొని బతుకమ్మలు ఆడుతూ బొడ్డెమ్మ లు వేస్తూ గుడిసెలు వేసుకొని నిరసన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. దళితులు మైనార్టీలు బడుగు బలహీన వర్గాల కు చెందిన నిరుపేదలు గతంలో 25 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్లాట్ల స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పట్టించుకోని ప్రభుత్వం అని ఇది ప్రభుత్వ అధికారులకు నిదర్శనమన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలకు అండగా నిలిచి పోరాటం చేస్తుందన్నారు. ఈ పోరాటంలో నిరుపేదలకు ఇల్లు తగ్గేంతవరకు అలుపెరుగని ఎర్ర జెండా నే పోరాటం చేస్తుందని ఏ పార్టీలు కూడా చేద్దామని ఎర్ర జెండా తోనే ఏదైనా సాధ్యం అవుతుందన్నారు. ఈ పోరాటంలో లబ్ధిదారులు భాగస్వామ్యం కావాలని ఆయన వారికి పిలుపునిచ్చారు. మరో ఉద్యమానికి నాంది పలికింది దసరా పండుగ తర్వాత ఇందులో ఒక కుటుంబానికి 75 గజాలు అంతవరకు మొత్తం స్థలాన్ని హద్దులు ఏర్పాటు చేసుకొని చీరల గుడిసెలు తీసివేసి పర్మనెంట్ గుడిసె వేసుకోవాలని అన్నారు. వర్షం వచ్చినా నీళ్లు రాకుండా మంచిగా నిర్మించుకోవాలని ఆయన సూచించారు. అక్టోబరు7న దసరా పండుగ తర్వాత ఇక్కడ ఉన్న మా నాయకులు కమిటీ వేస్తామన్నారు. హనుమకొండలో 150 రోజులు గా భూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని ఇందులో 20 వేల మంది ఉదయము 10 గంటలకు వచ్చే సాయంత్రం వరకు గుడిసెల పోరాటం చేస్తున్నారన్నారు. ఇక్కడ కనీసం 500 మంది పోరాటం చేస్తున్నారన్నారు. హనుమకొండ వారు లో దీక్ష చేస్తుంటే పోలీసులు వచ్చి వారు ఒక పక్క ఉండి సాయంత్రం వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఇవన్నీ ముట్టడం లేదు ఏమి చేయడం లేదని అన్నారు. ఇక్కడేమో ఎవరు పోలీసులు రావట్లేదు ఒకరోజు మాత్రం మొదట్లో వచ్చారు ఇప్పటివరకు ఎవరు రావట్లేదన్నారు. అక్టోబర్ 1న భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈనెల 8న మక్తల్ కు వెళ్లి ఆయన స్వగహంలో అమరచింత మండలం లో ధూమ్ పారు కుంటలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్ల లోనే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు కదా వారి పరిస్థితి ఏమిటి అని వారి హద్దులు చూపించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి కదా అని చర్చించాను. అమరచింత ఆత్మకూర్ ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇస్తున్న డబల్ బెడ్ రూమ్ పథకం ద్వారా వారి అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలి కదా అంటే నేను తప్పకుండా నా ద్వారా చేస్తానని చిట్టెం రామ్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందన్నారు రెండు గంటలు ఎమ్మెల్యే తో చర్చించడం జరిగిందన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూం లు కావచ్చు ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు అడిగి నట్లు తెలిపారు. గుడిసెల పోరాటం కొనసాగుతున్నప్పటికీ ఎమ్మెల్యే రెండుసార్లు అమరచింత మండలానికి వచ్చి కనీసం గుడి దగ్గరికి వచ్చి పోరాట నాయకులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వహించాల్సిన బాధ్యత వహించాలి కదా ఒక ఎమ్మెల్యేగా అయినా కనీసం వచ్చిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు. గ గత 23 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. అక్టోబర్ 1న తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేయాల్సిందిగా ఆయన అందరికీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ రాజు, మండల నాయకులు ఎస్ అజరు, బుచ్చన్న, అనంతమ్మ, పగడ కుల లక్ష్మణ్ లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు.