Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజనుల బతకమ్మ
- ఆడేది , పాడేది వారే
- బతుకులపై నీలినీడలు
- పేదల బతుకలుపై ప్రభుత్వం దృష్టి సారించాలి
పండగ వచ్చిందంటే చాలు అ ఆనందమే వేరుగా ఉండేది. మహిళలు యువకులు చేసే సందడి ఊహించడమే కష్టం. పండగలు ఏవైనా... ఉత్సవాలు ఎక్కడ జరిగినా... బహుజనులు లేనిదే కార్యక్రమం మొదలు కాదు. బతుకమ్మ , కోలాటం, నృత్యాలు ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఆడినా.. పాడినా... నృత్యం చేసినా బహుజనులే ప్రధాన పాత్ర పోషిస్తారు. బహుజనుల ఆటలు పాటలు నేడు పరాదీనమై పోతున్నాయి. ఆనందంతో ఆడే పాటలు, ఆటలు నేడు కష్టాలను తలుచుకొని పాడాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. పేదల బతుకులో వెలుగులు నింపి బహుజన బతుకమ్మ ఆటలు పాటలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ సమయంలో జరిగిన బతుకమ్మ ఆటల తర్వాత బహుజనుల ఆట పాట వెలుగులోకి వచ్చింది. సుద్దుల బతకమ్మ, పూల బతకమ్మ ఇలా అనేక రకాలుగా ఆటలు ఆడుతారు. సంక్రాంతి, దసరా, ఉగాది, దీపావలి, వినాయకచవితి వంటి ఏ పండగలయినా... మహిళలు ఆటలు పాటలు అలరిస్తాయి. ముఖ్యంగా సాయంకాలం అయ్యిందంటే చాలు ప్రతి పండగలో బతకమ్మ ఆటలు ఆడుతారు. అయితే దసరా పండగకు ప్రతి ఒకరు ప్రత్యేకంగా ఆటల్లో పాలు పంచుకుంటారు. ఈసారి దసరా ఉత్సవాలు ఆశించిన స్థాయిలో నిర్వహించే పరిస్థితి కనబడుటలేదని పలువురు తెలిపారు.
సాగుబడి లేక
ఉమ్మడి జిల్లాలో సాగు అయినా.. సాగుదిగుబడి బారీగా తగ్గనుంది. బారీగా వర్షాలు పడుతుండటంతో పత్తి పంట దెబ్బతిన్నది. గత రబీలో వరి పంటను సాగు చేయరాదని ప్రచారం చేశారు. ఈసారి వరి సాగు చేస్తే... కొనుగోలు చేయరేమోనని వరిపంట సాగు బారీగా తగ్గింది. కెనాల్లు, రిజర్వాయర్ల కింద సైతం వరి సాగును నిలిపేశారు.సాగు చేసిన పత్తి దిగుబడి 20 అయినా వచ్చే అవకాశాలు లేవు. ముధురు చేనుకు ఆకుముడుత, పచ్చ దోమ తెగులు సోకింది. చెట్టు ఏపుగా పెరగలేదు. దీంతో చెట్టుకు 100 కాయలు ఉండాల్సి ఉండగా ఈసారి 20 కాయలు అయినా కనబడటం లేదు. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం సైతం ఆశించిన స్థాయిలో లేదు. రుణమాఫి, ఉద్యోగాలు, పక్కా గృహాలు ఇలా సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయకపోవడం వల్ల పండగ ఉత్సవాలపై నీళినీడలు కమ్ముకున్నాయి.