Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహబూబ్ నగర్
గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ సమస్యలను మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కి వివరించారు. బుధవారం హైదరాబాదులోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి సమస్యలను కూలకుషంగా వివరించినట్లు వారు తెలిపారు.నియోజకవర్గంలో ఎర్రవల్లి కొత్త మండలంగా ప్రకటించాలని 14 గ్రామ పంచాయితీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఇటీవల ప్రకటించిన లిస్టులో ఎర్రవల్లి లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిధుల కొరత వల్ల 100 పడకల ఆస్పత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ డిగ్రీ కళాశాల నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు జోగులంబ టెంపుల్ విస్తరణ పనులు జరగడంలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్యాము తదితరులు పాల్గొన్నారు.