Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ
- హాజరైన ఎమ్మెల్యే, అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ -ఉట్కూర్
ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్నపొర్ల గ్రామంలో బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందివ్వడంలో ముందున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుంద న్నారు. అదేవిధంగా మండలంలోని బాలుర ఉన్నత పాఠ శాల ఆవరణంలో మహిళ సమస్య ఆధ్వర్యంలో బతు కమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే చిట్టెం పాల్గొన్నారు. కార్యక్ర మంలో జెడ్పీటీసీ అశోక్ గౌడ్ ఎంపీపీ ఎల్కోటి లక్ష్మీనారా యణ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు బాల్ రెడ్డి, మాజీ జె డ్పీటీసీ అరవింద్ కుమార్, ఉప సర్పంచ్ హిబాద్ తుల్ రహి ఊరుకొండ : తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసా గిస్తుందని ఎంపీపీ బక్కరాజంగయ్య అన్నారు. బుధవారం మండలంలోని ఊరుకొండ పేట, నర్సంపల్లి, జకినాలపల్లి, ఇప్ప పహాడ్ గ్రామాల్లోని బతుకమ్మ చీరల పంపిణీకి హా జరైన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మం డల నాయకులు కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు అనిత నాగోజి, నిరంజన్ గౌడ్, అనిల్ రెడ్డి, వనజ బాలస్వామి, ఎంపీటీసీలు ఈశ్వరమ్మ ముత్యాలు, బంగారమ్మ శంకర్, ఉప సర్పంచ్‌లు బుచ్చమ్మ లక్ష్మయ్య, మంజులశ్రీనివాసులు, అధ్యక్షుడు లక్ష్మణ్, కో-ఆప్షన్ కలీం పాషా, సుజీవన్ రెడ్డి, గిరి నాయక్, మొండేళ్ల శ్రీశైలం, మొండేళ్ల రాజేష్, సర్పంచ్ మాలి పటేల్ రవీందర్ రెడ్డి, జగదీష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శివరామ రాజు, ఖలిక్ తదితరులు పాల్గొన్నారు
బిజినేపల్లి: మండలంలోని నంది వడ్డేమాన్‌లోని బుధవా రం ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్ గౌడ్, ఎంపీటీసీ ఉషన్న, పులేందర్ రెడ్డి, బంగారయ్య, వాసిరెడ్డి చెన్నయ్య శ్రీనివాస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలకపల్లి: మండల పరిధిలోని గౌరెడ్డి పల్లి, గట్టు నెల్లికు దురు, రామ్ రెడ్డి పల్లి గ్రామాల్లో బుధవారం సర్పంచులు వెంకట్ రెడ్డి, సుగుణ బాబు, గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదవ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు, మహిళలు పాల్గొన్నారు.
గట్టు: మండలంలోని పెంచికలపాడు తప్పెట్ల మొరుసు గ్రామాల్లోని బతుకమ్మ చీరాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పీటీసీ శ్యామల హన్మం తు నాయుడు, ఎంపీపీ విజయకుమార్ హాజరయ్యారు. అనం తరం గ్రామాల్లోని బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో సర్పంచులు పటేల్ శశికళ, హన్మంతు రెడ్డి, కృష్ణ య్య గౌడ్, ఎంపీటీసీ పారిజాతమ్మ, పటేల్ నరేందర్ రెడ్డి, బసవరాజు, తిమ్మప్ప, డాక్టర్ సీతారాములు, ఉప సర్పంచ్ ఆంజనేయులు,్ అశోక్, పంచాయతీ కార్యదర్శి తిమ్మప్ప, నర్సింహరెడ్డి అబ్దుల్ రజాక్, భీమన్న పాల్గొనారు.
ధరూర్: మండలంలోని పాగుంట పంచాయతీలోని బుధ వారం సుభాషిణి విష్ణువర్ధన్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు.
జడ్చర్ల: బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక అని జెడ్పీవైస్ చైర్మన్ కోడ్గల్ యదయ్య అన్నారు. బు ధవారం మండలంలోని పోలేపల్లిలో బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొని బతుకమ్మ ఎత్తుకున్నారు. అనంతరం మ హిళలకు ప్రభుత్వం అందిస్తున్న చీరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చేతన రాంరెడ్డి, మాచారం సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ లావణ్య, మార్కెట్ డైరక్టర్ శ్రీకాంత్ రెడ్డి, శ్రీను నాయక్, అశోక్ గౌడ్, ఉపాధ్యక్షుడు మైసయ్య, రాఘవేందర్ గౌడ్ పాల్గొన్నారు.
పెద్దమందడి: మండలంలోని జంగమయ్యపల్లిలో బుధవారం బతుకమ్మ చీరలను సర్పంచ్ సతీష్, ఎంపీటీసీ గిరమ్మ మహిళలకు పంపిణీ చేశారు. ఈ మేరకు.. ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ్ లక్ష్మి, ఆసరా పింఛన్లు, వివిధ సంక్షేమ పతకాలను ఇస్తుందన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్ర మంలోని ఉప సర్పంచ్ శ్రీనివాసులు, మహిళా సంఘం అధ్యక్షురాలు శాంతాబాయి పాల్గొన్నారు.
వెల్డండ: మండల కేంద్రంతోపాటు , రఘాయిపల్లి పంచా యతీ ఆవరణలో బుధవారం మహిళలకు గ్రామ సర్పంచ్ యెన్నం భూపతి రెడ్డి, అచ్చాలు, ఎంపీటీసీ మోతీలాల్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్ బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ల కార్డులను పంపిణీ చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంబించారు. కార్యక్రమంలో మండల వైద్యదాధికారి వినరు, ఎంపీటీసీ జ్యోతి నిరంజన్, యువ జన విభాగం మండల అద్యక్షుడు యాదగిరి, గ్రామస్థులు ప్రసాద్, శేఖర్, రంగయ్య పాల్గొన్నారు.
నవతెలంగాణ: మండలం, ఉమ్మాపూర్, ఉప్పల్ పాడు, వెంకటాపూర్, గజర, తిప్పారెడ్డిపల్లి, నిజాంబాద్, తిరుమ లగిరి, గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛ న్లు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. ఈ సందర్భంగా శిరీష మల్లయ్య యాదవ్, బాలస్వామి అంజి పద్మ శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మమ్మ, టీిఆర్‌ఎస్ జిల్లా నాయకులు లాలు యాదవ్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, అధికారులు ఎంపీడీవో పవన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, నాగేష్ వెం కటేశ్వరరావు, మల్లయ్య, సాయిలు, సుగుణమ్మ, లక్ష్మమ్మ, న ర్సిరెడ్డి, ఖలీల్, సైదులు, రవి యాదవ్ ఉన్నారు.
కందనూలు: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సాయి గార్డెన్ ఫంక్షన్హాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల నుంచి మహిళా సంఘాలు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చుకొని అన్ని ఒకే దగ్గర చేరి బతుకమ్మ సంబరాలు చేసు కున్నారు. పీడీడీ ఆర్డీఏ నర్సింగ్‌రావు, మెప్మా మేనేజర్ రాజేష్, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
బాలానగర్: మండలంలోని బుధవారం తాసిల్దార్ రాం బాయి, మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు సుశీల, అబివృద్ధి అధికారి లక్ష్మీదేవితోపాటు మాజీ ఎంపీపీ నరసింహు లు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డితోపాటు వివిధ గ్రామాల ఎంపీటీసీలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.