Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య
నవ తెలంగాణ-మహబూబ్నగర్
నేడు మన సమాజంలో బాలల హక్కుల రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ దేవయ్య అన్నారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా రెవిన్యూ సమావేశం మందిరంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. జిల్లాలో బాలల అందించే పౌష్టికాహారం, బాల కార్మిక వ్యవస్థ, ఫోక్సు చట్టం పని తీరు. జిల్లాలో బాలల హక్కుల స్థాయి కమిటీ పనితీరు. ఆరోగ్యం విద్య తదితర అంశాలపై అధికారులతో ఆయన కులం కుశంగా చర్చించారు. పాఠశాలల్లోని విద్యార్థులకు బాలల హక్కులపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. అంగన్వాడి సెంటర్లు పిల్లల స్థాయిని బట్టి ఆహారం అందించాలని వారు తెలిపారు. సెంటర్లో కనీస సౌకర్యాలు కరెంటు ఆటవస్తులు ఉండే విధంగా చర్యలు ఉండాలని ఆయన కోరారు. బాలికలపై వేధింపులు అత్యాచారాల విషయంలో పోక్స్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు చెడుదారుల వైపు వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2014 నుంచి నేటి వరకు 15 వేల పైకి పోక్స్ కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. పోలీసుల తరఫున బాలల హక్కులపై కళాజాత నిర్వహించి అవగాహన కల్పించాలని తెలిపా రు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్నందల్ పవర్ డీిఎం హెచ్వో కృష్ణ డీటీ డబ్ల్యూ అధికారిని జరిగిన ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.