Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిమ్మాజిపేట
గొరిట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ మార్ట్లో డిజిటల్ లావాదేవీలను వినియోగించుకోవాలని కార్య నిర్వహణ అధికారి నరేష్ కోరారు. స్థానిక సింగల్ విండో చైర్మన్, డీసీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం స్థానిక విండో కార్యాల యంలో రైతులకు, ఖాతాదారులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఈవో నరేష్ కుమార్ మాట్లాడుతూ.. సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అమ్మడం జరుగుతుందని రైతులు తమ వద్ద డబ్బులు లేని సమయంలో ఫోన్ ద్వారా గాని ఏటీిఎం ద్వారా లావాదే వీలను వినియో గించుకోవాలన్నారు. అదేవిధంగా పీఏసీఎస్ మార్ట్లో నిత్యవసర సరుకులతో పాటు ఖాతాదారులకు అన్నిరకాల అవసరాలకు తక్కువ ధరకే విద్యాసర సరు కులను విక్రయిస్తున్నామన్నారు. రైతులు, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని కోరారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్సీ బాలరాజు, డీసీసీబీ మేనేజర్ రమాదేవి, సూపర్ వైజర్లు, విండో డైరెక్టర్ శ్రీరాములు, సింగిల్ విండో సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కొత్తకోట: రైతులకు అండగా సింగిల్ విండో కార్యాలయం ఉందని రైతులను అన్ని విధాలుగా సొసైటీ ఆదుకుంటుందని డీసీసీబీ డైరెక్టర్ కొట్టం వంశిధర్ రెడ్డి అన్నారు. గురువారం సింగిల్ విండో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగిల్ విండో ద్వారా రైతులకు రుణాలు అందజేస్తున్నామన్నారు. అలాగే రైతు లకు పర్టిలైజర్ను సకాలంలో అందజేస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు అతి తక్కువ వడ్డీ రుణా లు, గోల్డ్ లోన్లు, వ్యక్తిగత రుణాలు తదితర రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. సొసైటీ మంచి లాభాల్లో ఉందన్నారు. ఇటీవల మదనపురం మండలం దంతనూర్లో సొసైటీ తరపున గోదాం, షాపింగ్ హాల్ నిర్మించుకున్నామని చెప్పారు. అలాగే రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో బాలరాజు, డైరెక్టర్లు బాలరాజు, గుంత సురేష్, చాపల భాస్కర్, బాలకృష్ణ రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, నాయకులు అయ్యన్న, శ్రీనివాస్ రెడ్డి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.