Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉరుములు మెరుపులతో వర్షం
- రెండు రోజులుగా కుండపోత వర్షం
- పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
- జలమయమైన పంటచేను
- వణిక్కి పోతున్న జిల్లా ప్రజలు
నవ తెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో వర్షం జడివానను తలపిస్తుంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పాలమూరు ప్రజలు చిగురుటాకుల వణికి పోతున్నారు. పక్షం రోజుల క్రితం కురిసిన వర్షానికి ఒరిస్సానికి 175 ఇండ్లు నీలమట్టం కాగా మరోసారి భారీ వర్షానికి మట్టి పెంకుటిల్లు కూలిపో యే అవకాశాలు ఉన్నాయని ప్రజాసంఘాలు, మహిళలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభ సమయంలో మాదిరిగా ఉరుములతో కూడిన వర్షాలు రా వడం జిల్లా ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. వెల్దండ మండలంలోని తుంకిరెడ్డి తండాలో ఇద్దరు చనిపోవడం మరో ఇద్దరికి గా యాలు కావడం గమనహర్హం. కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రక్షణ చర్యలు చేప ట్టాలని పార్టీలు ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
గురువారం 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వాగులు వంకలు, పొంగి పొర్లుతున్నాయి. కల్వకుర్తి నుంచి తెలకపల్లి వెళ్లే దారి మధ్యలో ఉండే దుందుభి నది ప్ర వహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూ ల్ కేసరి సముద్రం నుంచి వచ్చే చిన్నవాగు సైతం పొంగిపొ ర్లుతుంది. కొల్లాపూర్, గద్వాల, నాగర్‌కర్నూల్ వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో అనావృష్టితో బాధపడే పల్లెలు నేడు అతివృష్టితో తీవ్ర కష్టాలు ఎదుర్కొం టున్నారు. మంగళ వారం మొదలైన వర్షం గురువారం రాత్రి అంతా కురిసింది. విరామం లేని వర్షపాతంతో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వివిధ చోట్ల పత్తిని తీసే పనులు మొ దలయ్యాయి. వర్షాలకు పత్తినేల రాలే అవకాశాలున్నా యి. ముఖ్యంగా ఆముదం, కంది, మొక్కజొన్నతోపాటు బొప్పాయి బత్తాయి, జామపండ్లతోటలు కూరగాయల సాగు పూర్తిగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.
బిక్కుబిక్కుమంటున్న జనం
భారీ వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారు. ఇంకా గుడిసెలు మట్టి ఇండ్లలో నివసిస్తున్న వారు ఒణికి పోతున్నారు. ఏజెన్సీ చెంచులు ఆవాసాలు లేక అవస్థలు పడుతున్నారు. గతంలో కురిసిన వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 175 ఇల్లు నీలమట్టమయ్యాయి. తెలకపల్లి మండలంలో మట్టి ఇల్లు కూలి ఇద్దరు చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ సారి వెల్దండ మండలం తండాలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. తొలి ఆయిటి మాదిరిగా మెరుపులు ఉరుముల తో కూడిన వర్షం వస్తుంది. కృష్ణ కోయిల్‌సాగర్ బీమా నదు ల సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉనికి పోతున్నారు. కృష్ణానది ఎప్పుడు పొంగి పొర్లుతుందోననే భయాందో ళనలో ప్రజలు ఉన్నారు. గద్వాల జిల్లా గుర్రం గడ్డ కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి, తాడూరు, నాగర్ కర్నూల్ మండలాల ప్రజలు అధిక వర్షాలకు నదులు పొంగిపొర్లి రాకపోకలు నిలిచిపో యాయి. మండల తహసీల్దార్లు వెంటనే ముంపు గ్రామా లను పరిశీలించి రక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
కుప్పకూలిన విద్యుత్తు ఇంటర్నెట్
అధిక వర్షాల వల్ల జిల్లాలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. 24 గంటల కరెంటు ఎనిమిది గంటలకే పరిమి తమైంది. చినుకులు మొదలయ్యాయి అంటే చాలు వర్షం సాకుతో కరెంటును నిలిపేస్తున్నారు. వర్షం వస్తే ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. నెట్టు పనిచేయక పోవడంతో మీడియాతో పాటు వివిధ సైట్లు నిలిచిపోవడం తో యంత్రాంగం అయిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొంగిపోర్లతున్న వాగులు వంకలు
ఇటిక్యాల: మండలంతోపాటు వావిలాల, ఉదండాపు రం, చాగా పురం, సాబాద్, గోపాల్ దిన్నె, పెద్దదిన్నె, బట్లది న్నె, ము నగాల, నక్కలపల్లి, కోదండపురం, కొండేరు, జింక లపల్లి, శివ నంపల్లి, ధర్మవరం, ఆర్ గార్లపాడు, షేక్ పల్లి, సాస నూలు, వీరాపురంతో పాటు ఆయా గ్రామాల్లో గురు వారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొ ర్లుతున్నాయి. పలు గ్రామాల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులకు రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పటికైనా గ్రామస్తుల కష్టాలను గుర్తించి వాగు వంతెన నిర్మాణం చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని వారు విన్నవించుకున్నారు.