Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అమరచింత
గత ఇరవై నాలుగు రోజులుగా ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని దీక్ష చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం మండల కార్యదర్శి, మున్సిపల్ వైస్ చైర్మన్ జీఎస్ గోపి అన్నారు. గురువారం మండలంలోని ధూమ్ పారుకుంటలో గత 25 సంవత్స రాల క్రితం పంచాయతీ అధికారులు సర్వే నెంబర్56,57లో 400మంది ఇళ్లు లేని పేదలకు ఒక్కొక్కరికి రెండు సెంట్ల ఫ్లాట్లను ఇచ్చారని, 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి పొజిషన్, హద్దులు చూపించలేదని ఆరోపించారు. ధూమ్పారు కుంటలో తమకు ఇచ్చిన ప్లాట్లకు పొజిషన్ హద్దులు చూపించాలని పేద ప్రజలు ఆగ్రహంతో తాత్కాలికంగా గుడిసెలు వేసుకోవడం జరిగిందన్నారు. అక్టోబర్ 1న మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేసినట్లు ఆయన అధికారులకు డిమాండ్ చేశారు. గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పొజిషన్ హద్దులు చూపించి డబల్ బెడ్ రూమ్ నిర్మించే వరకు పోరాటం ఆగదని అధికారులకు హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటేష్, అజయ్, రవికుమార్, జ్ఞానం, వీరితో లబ్ధిదారులు పాల్గొన్నారు.