Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలానగర్ : కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ ఇంచార్జి అనిరుద్ రెడ్డి గత వారం రోజుల క్రిందట ప్రజా సమస్యలపై ప్రజా మద్దతుతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని అన్ని ఎమ్మార్వో ఆఫీస్ లో ముందు నిరాహార దీక్షల తో నీ చేతగానితనాన్ని ప్రశ్నిస్తే నువ్వు తీవ్ర అసహనం తో అనిరుద్ రెడ్డి పైన వ్యక్తిగత విమర్శలకు దిగు తున్నావు. గురువారం బాలానగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆది రమణారెడ్డి విలేకరుల సమావేశంలో నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతగా ప్రజల కోసం ప్రజా గొంతుకై పేదలకు మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే ఇవ్వాలని బహిరంగంగా ప్రశ్నించారు .దానికి నువ్వు చేతనైతే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలి లేకుంటే నా వల్ల కాదని నేనొక అసమర్ధ ఎమ్మెల్యే అని ముఖ్యమంత్రిని అడగలేనని అడిగితే నాకు మళ్ళీ బీఫామ్ రాదని ఒప్పుకుని నీకు ఓటు వేసిన ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. కానీ నువ్వు నీ అసమర్ధ పుతనాన్ని తోచి పుచ్చుకుంటూ మా నాయకుడి పైన దాడి చేపిస్తానని బహిరంగంగా హెచ్చరిస్తున్నావు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచింది ప్రజా సమస్యల పైన పోరాడే నాయకులను ఇబ్బంది పెట్టడానికేన వారిపై దాడి చేయడాని కాదన్నారు. .నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామాన్ని మండలం గా చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి నేడు ఆ గ్రామ ప్రజలను ఆ ప్రాంత ప్రజలను అవ మానపరిచే విధంగా అది సాధ్యం కాదని నువ్వు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్న ఎంపీటీసీలు నీ మాట వినడం లేదని బహిరంగంగా ఒప్పుకున్నావు మీ ఎంపీటీసీలు మీ మాటకు విలువ ఇవ్వకుంటే ఇంకా నీకు ఎమ్మెల్యే పదవి దేనికోసం తక్షణమే రాజీనామా చేయిని తెలిపారు.
బాలనగర్ మండలంలోని గ్రామాలకు వెళ్లే రోడ్లు తీవ్ర అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లపై నువ్వు వెళ్ళలేవు కాబట్టే నువ్వు మూడు కోట్ల విలువ చేసే అల్ట్రా షక్స్ ఉన్న కార్లో తిరుగుతున్నవని మీ కార్యకర్తలే చెప్తున్నారు. జడ్చర్లలో మా నాయకుడి పోరాటంతో వందపడకల ఆసుపత్రిని హుటా హుటిన భయంతో ప్రభుత్వం నిర్మించిన అది వర్షం వచ్చినప్పుడు అలా మునిగి పోతుంది నీ తెలివి లేని తనానికి ఇదే నిదర్శనం వందల కోట్లు నీటిపాలు చేసినవ్. కాంట్రాక్టర్లతో కక్కుర్తి చేష్టలతో 20 శాతం కమిషన్లతో ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టి స్తున్నావు. సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది రమణారెడ్డి శంకర్ నాయక్ వెంకట్ నాయక్ లింగారం నరసింహారెడ్డి రజక సంఘం అధ్యక్షుడు యాదయ్య రఫిక్ నరసింహులు పాండు నాయక్ ఉన్నారు.