Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా
- చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్
నవతెలంగాణ- ధరూర్
జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా సాగు చేస్తున్నటువంటి సీడ్ పత్తి రైతులపై ఆర్గనైజర్ల దోపిడీని అరికట్టాలని,కంపెనీకి, రైతుకి మధ్యవర్తులుగా ఉన్న కొంతమంది ఆర్గనైజర్లు విత్తనపత్తిని రైతులు సాగు చేసి కంపెనీలకు అప్పజెప్పిన తర్వాత జీ.వో.టి ఫలితాల్లో పాస్ ఐనా కూడా ఫెయిల్ అయ్యాయని చెబుతూ రైతులను మోసం చేస్తూ అప్పలపాలు చేస్తున్నారని రైతుల యొక్క భూములను బలవంతంగా రాయించుకుంటున్నారని వీటి పై జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని లేనిచో న్యాయస్థానాలను,రుణ విమోచన కమిషన్ ను సైతం ఆశ్రయిస్తామని గొంగళ్ళ రంజిత్ కుమార్ అన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో జరగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఒక్కొక్క కేసును వివరించారు. బింగిదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల దొడ్డన్న అనే రైతు కు 2019లో నకిలీ కల్తీ విత్తనాల కేసు అయింది. ఈ రైతుకు 2017-18 సంవత్సరం లో ఆర్గనైజర్ ఏక్లాస్ పురం నాగేశ్వర్ రెడ్డి 11 క్వింటాళ్లు ఫెయిల్ అయ్యాయని చెప్పి 2019 లో గింజలు వాపస్ ఇవ్వగా పోలీసులు రైడ్ చేసి నకిలీ కల్తీ విత్తనలుగా బావించి దొడ్డన్నపై కేసు నమోదు చేశారు. పోలీసులు పట్టుకున్న విత్తనాలు ఫెయిల్ అయినవని అందుకే ఆర్గనైజర్ తిరిగి వాపసు ఇచ్చాడని నిరూపించుకొనుటకు వ్యవసాయ శాఖ దగ్గర ఆర్.టి.ఐ యాక్ట్ ప్రకారం సమాచారం తీసుకోగా, అసలు కంపెనీ ప్రకటించిన ఫెయిల్ అయిన జాబితాలో దొడ్డన్న అనే రైతు యొక్క లాట్ నెంబర్ విత్తనాలను జీవోటి పరీక్షకు పంపేటప్పుడు శాంపిల్ తీసే క్రమంలో కంపెనీ నెంబర్ కేటాయిస్తుంది లేదని తెలిపారు. మరి ఇప్పుడు ఆ నకిలీ కల్తీ విత్తనాల కేసు నాగేశ్వర్ రెడ్డి మీద కావాలని అలాగే పాసైన విత్తనాలను కూడా ఫెయిల్ అయ్యాయని చెప్పినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రకంగా రైతు దొడ్డన్న పత్తి విత్తనాలను ప్రతి సంవత్సరం కొన్ని విత్తనాలు ఫెయిల్ అయ్యాయని చెబుతూ అప్పు పడ్డావనే నెపంతో నాగేశ్వర్ రెడ్డి దొడ్డన్న పొలమును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని దీనిపై పూర్తి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో కేసులో మ్యాకలసోంపల్లికి చెందిన రమేష్ రెడ్డి అనే ఆర్గనైజర్ గట్టు మండలం ఆరగిద్దకు చెందిన రైతు వీరన్న పై అప్పుపడ్డావని పొలం కు వెళ్లి దౌర్జన్యం చేశాడని, దీనిపై రైతు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టగా, ఆ ఆర్గనైజరు కోర్టు నుంచి అప్పు వసూలు కోసం నోటీసు పంపిన తర్వాత కూడా మళ్లీ రెండోసారి కొంతమంది అనుచరులు తాగి వెళ్లి రైతు పొలం దగ్గరికే వెళ్లి భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా దాడి చేశారని మరి దీనిపై కోర్టులో కేసు ఉన్న రైతు పోలం దగ్గరకి దాడికి ఏ రకంగా వెళ్తారని, వాస్తవానికి రైతు వీరన్న మాత్రం అసలు నేను అప్పు లేనని, గతం లో ఖాళీ ప్రాంసరీ నోట్లపైన సంతకాలు పెట్టించుకుని,అప్పు చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని అన్నారు. ఈ రకంగా రైతుల పొలాల దగ్గరికి వెళ్లి ఆర్గనైజర్లు అప్పుల కోసం దాడి చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు.మరికొన్ని కంపెనీలు ఫెయిల్ అయిన జాబితాను వ్యవసాయ శాఖకు ఒకలా ఇచ్చి, వ్యక్తిగతంగా రైతు వెళ్లి సమాచారం కోరగా మరోలా ఇస్తున్నారని, అసలు కంపెనీలు ఫెయిల్ అయిన విత్తనాల జాబితాను వ్యవసాయ శాఖకు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని, గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో , కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులతో ఒప్పందాలు చేసుకుంటామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు కావడం లేదని తెలిపారు. , దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టి సారించి దోపిడిని అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు రైతులు దొడ్డన్న, వీరన్న, జమ్మన్న, చిన్నా గౌడ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.