Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాయలసీమ, చెన్నై, కుర్ల రైలు ఆపాలి
- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండవ అతి పెద్ద రైల్వే స్టేషన్.
- స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులకు వినతి పత్రాలు
- పట్టించుకొని పాలకులు
తెలంగాణ, కర్ణాటకకు సరిహద్దులన ఉన్న నారాయణపేట జిల్లాలోని ఏకైక రైల్వే స్టేషన్ కృష్ణ, మండలము వాసులకు రైలు ప్రయాణము రోజురోజుకూ దూరమవుతోంది.కరోనా సమయంలో రద్దీని నియంత్రించడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు కొన్ని స్టేషన్లలో రైళ్లు ఆపకుండా నడిపారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత రైళ్లను పునరుద్ధరించినా కష్ణ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు వారణాసి , రాయలసీమ, చెన్నై, కుర్ల రైలు ఆపడంలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండవ అతి పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి రైలు ప్రయాణం చేసేవారు అధికంగా ఉన్నారు, కృష్ణానది పక్కన ఉన్నందున ఇరుమార్గాల నడుస్తున్న రైలు వాటరింగ్ నింపుకుంటున్నాయి, కానీ టికెట్ మాత్రం ఇవ్వడం లేదు, కష్ణా రైల్వే స్టేషన్ జంక్షనుగా అవతరిస్తున్న రైలు ఆపకుండా పోవడమేంటని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని రైళ్లను ఈ స్టేషన్లలో ఆపాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదు.
నవతెలంగాణ- కృష్ణ
దీక్షలు చేసిన ఫలితం లేదు
కృష్ణ స్టేషన్లో ఆపే 7 ట్రైన్లను కరోనా అనంతరం ఆపకపోవడంతో రైల్వే జనరల్ మేనేజర్ కు, కేంద్ర రైల్వే మంత్రి కూడా వినతి పత్రం అందించాం. తర్వాత నిరాహార దీక్షలు సత్యాగ్రహాలు చేశాం. అయిన ఫలితం లేదు.
- అమర్ దీక్షిత్ మాజీ సర్పంచ్ కృష్ణ
అన్ని రైళ్లను ఆపాలి
కరోనా అనంతరం కృష్ణ స్టేషన్లలో రైళ్లు నిలపకపోవడంతో ప్రయా ణికులకు ఇబ్బంది కలుగుతుంది. సరిహద్దు ప్రాంతమైన కృష్ణ అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నందున ఉన్నతా ధికారులకు తక్షణమే చొరవ తీసుకొని రద్దైనా అన్ని రైలు ఆపాలి.
- పూర్ణిమ పాటిల్ ,ఎంపీపీ కృష్ణ మండలం
కృష్ణ స్టేషన్ జంక్షనగా మారుతుంది.
దేవరకద్ర నుంచి కష్ణ రైల్వే లైన్ అవుతుండడంతో కృష్ణా స్టేషన్ జంక్షన్‌గా మారుతుంది. కావున నారా యణపేట జిల్లాలోని ఏకైక రైల్వే స్టేషన్ కావున వాటరింగ్ కోసం ఉన్నారు. కానీ టికెట్ ఇవ్వటం లేదు అన్ని రైలు ఆపాలి.
- పల్లె సురేష్,కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్