Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మక్తల్
కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల తల్లిదండ్రులకు వరమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మక్తల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 252 మంది లబ్ధిదారుల కల్యాణలక్ష్మిపంపిణీ చేశారు. మక్తల్ ఎంపీపీ మనజన్మ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్.ఆర్ఐ కృష్ణారెడ్డి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద మద్య తరగతి ఇంట్లోఆడ పిల్లకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు ఏదో ఒక ఆస్తిని.అమ్ముకొని పెళ్లి చేసే వారని టీఆర్ఎస్ పభుత్వం హయాంలో కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంతో కొంత ఆర్థిక బాధలు ఉండవన్నారు.ప్రభుత్వం హయాంలో మధ్యతరగతి పేద తరగతులను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని. వయసు మళ్ళిన వారి ఆదరణ కోసం ఆసరా పింఛన్ వల్ల డబ్బులు సంతోష పడుతున్నారని తెలిపారు. అన్ని వర్గాల వారిని ఆదు కోవడమే తన లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, పెద వర్గాల్లో ప్రభుత్వం పై ఆదరణ ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అమరేందర్ రెడ్డి,నరసింహా రెడ్డి.శివారెడ్డి,రామలింగం.ఎంపిటిసి బలరాంరెడ్డి,సత్యనారా యణ మక్తల్ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.