Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ మహేష్
నవతెలంగాణ - బల్మూరు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలలో చిత్తశుద్ధితో పారిశుద్ధ్యం చేసేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక అవార్డులు దక్యయని అవార్డులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభు త్వం గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైందని జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ మహేష్ అన్నారు.బల్మూరు మండల గ్రామ పంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశము మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షులు నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రామపం చాయ తీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ మహేష్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్య నాయక్, సిఐటియు నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంపీలు ఎమ్మెల్యేల జీతాలు ఇతర సిబ్బంది జీతాలు ఇష్టానుసారంగా పెంచుకుంటూ చట్టాలు చేసు కుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ,గ్రామాలను నిరంతరం రోగాల బారిన పడకుండా శుభ్రము చేస్తూ తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు పెంచడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా గ్రామపం చాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 21000 ఇవ్వాలని , ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని , మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నవంబర్ 23, 24 తేదీలలో జరిగే తెలంగాణ గ్రామ పంచా యతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో గత పోరా టాలను సమీక్ష చేసుకొని భవిష్యత్ కార్యాచరణను రూంపొందించి రెండేళ్ల పాటు గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలపై జరిగే కార్యచరణను రూ పొందించనున్నారని వారు అన్నారు. ఈ సమా వేశంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు నిరంజన్ కొండయ్య ఈశ్వరయ్య సత్యనారాయణ పర్వతాలు, సాహిద్, మల్లేష్, పర్వతాలు, శంకర్, లక్ష్మమ్మ మా ఎల్లమ్మ మల్లేష్ కార్మికులు పాల్గొన్నారు.